Fire Accident | రంగారెడ్డి జిల్లా గగన్‌పహాడ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. థర్మకోల్ తయారీ పరిశ్రమలు ప్రమాదంతో అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి ఫైర్ ఇంజిన్లను తరలించారు. ఆరు ఫైర్ టెండర్ల సహాయంతో మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదంతో నల్లటి దట్టమైన పొగ కమ్మివేసింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేదని అధికారులు పేర్కొన్నారు. వెల్డింగ్ పనులు చేస్తుండగా థర్మకోల్ పరిశ్రమలో షార్క్ సర్క్యూట్ జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. విద్యుత్ తీగల నుంచి థర్మకోల్ షీట్లకు మంటలకు అంటుకున్నాయి.