కరీంనగర్ : జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న శాతవాహన యూనివర్సిటీలో శనివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. యూనివర్సిటీలోని చెట్ల పొదల్లో మంటలు చెలరేగాయి. బాయ్స్ హాస్ట్ నుంచి ఏంబీఏ కాలేజీ వరకు మంటలు విస్తరించాయి. మూడు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తోంది. అగ్నిప్రమాదంతో విద్యార్థులు, యూనివర్సిటీ అధికారులు ఆందోళనకు గురవుతున్నారు.