లైంగిక దాడి కేసులో బాలీవుడ్ సింగర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు
కాస్ట్యూమ్ స్టైలిస్ట్‌పై లైంగిక దాడి ఆరోపణలకు సంబంధించి బాలీవుడ్ సింగర్, కంపోజర్ రాహుల్ జైన్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది.
ముంబై : కాస్ట్యూమ్ స్టైలిస్ట్‌పై లైంగిక దాడి ఆరోపణలకు సంబంధించి బాలీవుడ్ సింగర్, కంపోజర్ రాహుల్ జైన్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. రాహుల్ తన ముంబై ఫ్లాట్‌లో 30 ఏండ్ల కాస్ట్యూమ్ స్టైలిస్ట్‌పై లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలున్నాయి. ఇన్‌స్టాగ్రాంలో తనను పరిచయం చేసుకున్న రాహుల్ జైన్ తన వర్క్ గురించి ప్రశంసలు గుప్పించాడని అంధేరిలోని తన ఫ్లాట్‌కు రావాలని ఆహ్వానించాడని కాస్ట్యూమ్ స్టైలిస్ట్ పేర్కొంది.
ఆగస్ట్ 11న ఆమె రాహుల్ జైన్ ఫ్లాట్‌కు రాగా తన వార్డ్రోబ్ చూపిస్తాననే సాకుతో కాస్ట్యూమ్ స్టైలిస్ట్‌ను బెడ్రూంలోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని అభియోగాలు నమోదయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహిళ ఫ్రీలాన్స్ కాస్ట్యూమ్ స్టైలిస్ట్‌గా పనిచేస్తోంది. లైంగిక దాడిని ప్రతిఘటించడంతో రాహుల్ తనను వేధించాడని, ఆధారాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడని బాధితురాలు పేర్కొంది.
మహిళ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశామని పోలీసులు తెలిపారు. కాగా తనపై లైంగిక దాడి ఆరోపణలు నిరాధారమని రాహుల్ జైన్ తోసిపుచ్చారు. ఆ మహిళ ఎవరోకూడా తనకు తెలియదని, ఆరోపణలు పూర్తిగా అసత్యాలని అన్నారు. కాగా తనపై లైంగిక దాడికి పాల్పడి బలవంతంగా అబార్షన్ చేయించాడని ఓ బాలీవుడ్ పాటల రచయిత గత ఏడాది అక్టోబర్‌లో రాహుల్ జైన్‌పై ఆరోపణలు చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

