Bank robbery | జీవితం బోర్ కొట్టింది.. ఎంటర్టైన్మెంట్ కోసం బ్యాంకులో దోపిడీ చేశా..
Bank robbery | జీవితంలో బోర్ కొట్టడంతో కొత్తగా ఏదైనా చేయాలని ఓ వ్యక్తి బ్యాంకునే దోపిడీ చేశాడు. రెండ్రోజులాగి మరోచోట ఉన్న గ్యాస్ స్టేషన్లో నగదు ఎత్తుకెళ్లాడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల వెనక్కి తోసేయబడ్డాడు.
Bank robbery | అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ షాకింగ్ దొంగతనం కేసు వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన జీవితంపై బోర్ కొట్టిందని, వినోదం కోసం కొత్తగా ఏదైనా చేయాలని భావించి రెండు దొంగతనాలకు పాల్పడ్డాడు. ఓర్లాండో నగరంలోని గ్యాస్ స్టేషన్, బ్యాంకులో దోపిడీకి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేశారు. విచారణలో ఈ విషయాలను వెల్లడించడంతో పోలీసులు అవాక్కయ్యారు.
అమెరికన్ మీడియా ప్రకారం, 45 ఏండ్ల వయసున్న నికోలస్ జాపటర్కు జీవితం పట్ల బోర్ కొట్టింది. దాంతో ఎంటర్టైన్మెంట్ కోసం ఏదైనా కొత్తగా చేయాలనుకున్నాడు. ఆలోచిస్తుండగా బ్యాంకు దోపిడీ చేయడం బాగుంటుందనిపించింది. బ్యాంకులో దోపిడీ చేస్తున్న సమయంలో పోలీసు టోపీ, అద్దాలు ధరించాడు. డిసెంబర్ 5న ఉదయం 9.30 గంటల ప్రాంతంలో బ్యాంకులో తొలి దోపిడీకి పాల్పడ్డాడు. బ్యాంకు నుంచి డబ్బు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.
తొలి దోపిడీ పర్వం విజయవంతంగా ముగియడంతో రెచ్చిపోయిన నికోలస్.. రెండు రోజుల తర్వాత మరో దోపిడీకి పథక రచన చేశాడు. డిసెంబర్ 7వ తేదీ సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఓ గ్యాస్ స్టేషన్‌కు చేరుకుని అక్కడ ఉన్న నగదుతో పారిపోయాడు. గమ్మత్తైన విషయం ఏంటంటే.. బ్యాంకులోగానీ, గ్యాస్ స్టేషన్లో గానీ నికోలస్ ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా.. పేపర్‌పై ఏదో రాసి చూపిస్తూ నగదు ఎత్తుకెళ్లాడు. అరెస్టయిన తర్వాత బోర్ కొట్టి ఈ దోపిడీలకు పాల్పడినట్లు ఓర్లాండో పోలీసుల ఎదుట నిందితుడు నికోలస్ అంగీకరించాడు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

