Online Scam | రూ. 113 రిఫండ్ కోసం 5 లక్షలు పోగొట్టుకున్న డాక్టర్
ఢిల్లీకి చెందిన ఓ డాక్టర్ క్యాబ్ యాప్ నుంచి రిఫండ్ పొందేందుకు (Online Scam) ప్రయత్నిస్తూ ఏకంగా రూ. 5 లక్షలు పోగొట్టుకున్నారు.
న్యూఢిల్లీ : దైనందిన అవసరాలతో పాటు లొకేషన్స్ గుర్తించడం నుంచి కాంటాక్ట్ వివరాలను పొందడం వరకూ మనం సెర్చింజన్ దిగ్గజం గూగుల్‌నే ఆశ్రయిస్తాం. గూగుల్‌పై జనం ఆధారపడిన రోజుల్లో ఇదే వేదికగా అక్రమార్కులు చెలరేగుతూ సైబర్ నేరాలతో అమాయకులను నిండా ముంచేస్తున్నారు. లేటెస్ట్గా ఢిల్లీకి చెందిన ఓ డాక్టర్ క్యాబ్ యాప్ నుంచి రిఫండ్ పొందేందుకు (Online Scam) ప్రయత్నిస్తూ ఏకంగా రూ. 5 లక్షలు పోగొట్టుకున్నారు. సఫ్ధర్‌జంగ్ ఎన్క్లేవ్ అర్జున్ నగర్ నివాసి ప్రదీప్ చౌధురి క్యాబ్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి రూ. 113 రిఫండ్ కోరే క్రమంలో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో బిగుసుకుని భారీ మొత్తం కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డాక్టర్ చౌధురి గురుగ్రాంకు క్యాబ్ బుక్ చేసుకున్నారు.
తొలుత రైడ్‌కు రూ. 205 చూపగా చివరిలో రూ. 318 చూపింది. రూ. 113 అదనంగా చార్జ్ చేయడంతో క్యాబ్ డ్రైవర్‌ను డాక్టర్ చౌధురి ప్రశ్నించారు. రిఫండ్ కోసం క్యాబ్ కంపెనీ కస్టమర్ కేర్‌ను సంప్రదించాలని డ్రైవర్ సూచించాడు. దీంతో గూగుల్‌లో కస్టమర్ సర్వీస్ నెంబర్ కోసం డాక్టర్ సెర్చ్ చేశారు. క్యాబ్ కంపెనీకి చెందిన నెంబర్‌గా గుర్తించి ఆ నెంబర్‌కు కాల్ చేశారు. కాలర్ కస్టమర్ కేర్ ప్రతినిధిగా నమ్మబలికిన వ్యక్తితో రిఫండ్ గురించి డాక్టర్ చౌధురి వివరించారు. ఆపై కస్టమర్ ఫిర్యాదులను పరిష్కరించే రాకేష్ మిశ్రాకు కాల్‌ను రీడైరెక్ట్ చేశారు.
రిమోట్ సెన్సింగ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, దాన్ని తన ఈ-వ్యాలెట్‌కు యాక్సెస్ చేసుకోవాలని బాధితుడికి మిశ్రా సూచించాడు. ఆపై రిఫండ్ అమౌంట్‌ను వేసి, ఫోన్ నెంబర్ తొలి ఆరు అంకెలను వెరిఫికేషన్ కోసం ఇవ్వాలని మిశ్రా కోరాడు. వెరిఫికేషన్ ప్రక్రియ కోసం చౌధురి మిశ్రా చెప్పినట్టు అనుసరిస్తూ ఆయన కోరిన సమాచారం అందించారు. తన ఓటీపీని కూడా ఆయన షేర్ చేశారు. దీంతో అనధికార లావాదేవీలతో డాక్టర్ చౌధురి ఏకంగా రూ. 5 లక్షలు పోగొట్టుకున్నారు. మోసపోయానని గ్రహించిన చౌధురి సైబర్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :
Hyderabad | బెంగళూరు ఢమాల్ హైదరాబాద్ జిగేల్.. నగరంలో ఆఫీస్ స్పేస్‌కు భలే గిరాకీ
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

