ఆస్తి వివాదం.. పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ హత్య

లక్నో: ఆస్తి వివాదం నేపథ్యంలో ఒక పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ హత్యకు గురయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 50 ఏండ్ల అమర్‌పాల్ ఢిల్లీలో పోలీస్ హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. కుటుంబ ఆస్తి గొడవ నేపథ్యంలో ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాలోని సొంత ఊరుకు వెళ్లారు. అమర్‌పాల్ ఆదివారం బైక్‌పై ఢిల్లీకి తిరిగి వస్తుండగా డాటా కుర్ద్ గ్రామం సమీపంలో కుటుంబ సభ్యులు కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయనను జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు.
అమర్‌పాల్ కుటుంబం ఫిర్యాదుతో ఆయన ఇద్దరు సోదరులైన మహావీర్ సింగ్, నేపాల్ సింగ్‌తోపాటు మేనల్లుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారిలో ఉన్న ఆ ముగ్గురిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

