కోడలిని చంపి.. తలతో పోలీసు స్టేషన్కు వెళ్లిన అత్త
అమరావతి : శ్రావణ మాసం కదా.. ఇంటికొచ్చి భోజనం చేసి వెళ్లు అని అత్త ఆప్యాయ పలుకరింపు. కోడలు కూడా కరిగిపోయింది. అత్త పిలిచిందే ఆలస్యం.. ఆమె ఇంట్లో కోడలు వాలిపోయింది. అప్పటికే పథకం పన్నిన అత్త.. కోడలిని అతికిరాతకంగా చంపేసింది. ఆ తర్వాత మొండెం నుంచి తలను వేరు చేసింది. ఏ మాత్రం భయపడకుండా.. కోడలి తలతో పోలీసు స్టేషన్కు వెళ్లి లొంగిపోయింది. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా రాయచోటిలో చోటు చేసుకుంది.
రాయచోటి పట్టణంలోని కే రామపురానికి చెందిన సుబ్బమ్మ.. తన సొంత అక్క కోడలు వసుంధర(35)ను తన ఇంటికి రావాలని, భోజనం చేసి వెళ్లాలని కోరింది. అయితే వసుంధరను చంపాలని సుబ్బమ్మ ముందే ప్లాన్ చేసింది. ఇందుకు బంధువుల సహకారం కూడా కోరింది. ఇక ఇంటికి చేరుకున్న వసుంధరపై పథకం ప్రకారం.. తన సమీప బంధువుల సహాయంతో సుబ్బమ్మ దాడి చేసి చంపేసింది. అనంతరం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయచోటి పోలీసు స్టేషన్కు కోడలి తలను తీసుకెళ్లి లొంగిపోయింది. అయితే కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాల వల్లే సుబ్బమ్మ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వసుంధర మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajnath Singh | దేశాన్ని అస్తిర పరిచేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఆందోళనలు.. ఇండియా బ్లాక్పై రాజ్నాథ్ సింగ్ ఆరోపణ
KTR | ఆంధ్రలో జల పండగ ఎట్లయితది? తెలంగాణలో కరువు ఎందుకుంటది? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు.. ర్యాలీకి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ
Kumbha | ‘కుంభ’లోని శక్తిని ఇప్పుడే తట్టిలేపాలని అనుకోవడం లేదు.. పృథ్వీరాజ్ బర్త్డేపై రాజమౌళి ట్వీట్
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

