ముక్కలుగా నరికి.. పట్టాలపై వేశారు
క్రైం న్యూస్ | మతి స్థిమితం లేని ఓ గిరిజన వృద్ధురాలిని దారుణంగా ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేసిన విషాద సంఘటన మంగళవారం జిల్లాలోని గార్ల మండలంలో వెలుగు చూసింది.

మహబూబాబాద్ : మతి స్థిమితం లేని ఓ గిరిజన వృద్ధురాలిని దారుణంగా ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేసిన విషాద సంఘటన మంగళవారం జిల్లాలోని గార్ల మండలంలో వెలుగు చూసింది. డోర్నకల్ రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం గార్ల మండల శివారులోని డబ్బాల మోరి వద్ద దిగువ రైల్వే ట్రాక్ మధ్యలో ఉదయం సుమారు 65 ఏళ్లున్న వృద్ధురాలి మృతదేహం ముక్కలుముక్కలుగా పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
ఘటనపై పోలీసులు ఆరా తీసి ఆమెను ఖమ్మం జిల్లా కారేపల్లి(సింగరేణి) మండల పరిధి బద్యాతండావాసిగా గుర్తించారు. కాగా మృతురాలు తనను కుమారులు పట్టించుకోవడం లేదని, తనది కారెపల్లి అని చెబుతూ మూడు రోజులుగా ట్రాక్ వెంట తిరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి 11-12గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చంపి, శరీర భాగాలను ముక్కలుగా చేసి గోనె సంచిలో మొండెం భాగాన్ని తెచ్చి ట్రాక్ మధ్యలో వదిలి వెళ్లారు.
మృతురాలికి ముగ్గురు కుమారులుండగా భర్త ఇదివరకే చనిపోయాడు. రైల్వే డీఎస్పీ చంద్రభాను, ఖమ్మం రైల్వే ఎస్సై రవికుమార్ ఆదేశాల మేరకు డోర్నకల్ రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఆళ్ల సత్యనారాయణరెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

