Crime News : నాయనమ్మ దినాలకు వచ్చి.. తిరిగిరాని లోకాలకు..

పెద్దేముల్ : మంబాపూర్ నుంచి తాండూరుకు బైక్‌పై వెళుతుండగా బైక్ అదుపు తప్పి ఓ మహిళ మృతి చెందిన సంఘటన పెద్దేముల్ పోలీసు స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. మంబాపూర్ గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని మంబాపూర్ గ్రామానికి చెందిన ద్యావరి వీరారెడ్డి దంపతుల పెద్ద కుమార్తే ద్యావరి జ్యోతి(34)ని యాలాల మండలం బాగాయిపల్లికి చెందిన హన్మంత్‌రెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. అయితే ఇటీవల మంబాపూర్లో వీరారెడ్డి తల్లి మరణించారు. కాగా గురువారం నాయనమ్మ దినాలకు జ్యోతి, భర్త హన్మంత్‌రెడ్డితో కలిసి వచ్చింది. శుక్రవారం తిరుగి వెళ్తుండగా మంబాపూర్ రైస్ మిల్ సమీపంలో బైక్ అదుపు తప్పడంతో జ్యోతి కింద పడింది.
ఆమెకు తలకు బలమైన గాయం అయింది. వెంటనే ఆమెను తాండూరు జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందింది. దీంతో మంబాపూర్ గ్రామంలో వీరారెడ్డి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతురాలు జ్యోతికి ఓ కూతురు, కుమారుడు, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

