న్యూయార్క్ : ఆ జంట తామెక్కడున్నదీ మైమరచి శృంగారంలో మునిగితేలారు. అమ్యూజ్మెంట్ పార్క్‌లోని జెయింట్ వీల్లో కామకేళిలో మునిగిన జంట చివరికి కటకటాలపాలైంది. అమెరికాలోని ఒహియోలో ఈ ఘటన జరిగింది. బహిరంగ ప్రదేశంలో నీచంగా ప్రవర్తించినందుకు గుర్తుతెలియని జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జెయింట్ వీల్ రైడ్‌లో శృంగారం చేస్తూ 32 ఏండ్ల వయసు కలిగిన స్త్రీ, పురుషుడు పట్టుబడ్డారని సెడర్ పాయింట్ అమ్యూజ్మెంట్ పార్క్ అధికారులు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారానికి ఇద్దరు పిల్లలు, నలుగురు మహిళలు ప్రత్యక్ష సాక్షులని చెప్పారు. తాము శృంగారానికి పాల్పడలేదని తొలుత చెప్పిన జంట ఆపై అంగీకరించింది.
మరోవైపు జెయింట్ వీల్ కార్ట్‌లో నగ్నంగా మారిన ఇద్దరూ శృంగారంలో పాల్గొన్నారని, తాము వారిని చూసినట్టు ఆ జంట గ్రహించినా తమను చూసి నవ్వుతూ శృంగారం కొనసాగించారని అక్కడున్న వారు చెప్పారని పోలీసులు తెలిపారు.