అర్ధరాత్రి దారుణ హత్య

సొంత బావమరిదిని హత్య చేసిన బావ
పోలీసులు అదుపులో నిందితుడు
మలక్‌పేట్ : నిండు గర్భిణి అయిన అక్కతో గొడవ పడితే చంపేస్తానని అన్న బావమరిదిని కత్తితో పొడిచి కడతేర్చాడు. శుక్రవారం రాత్రి మూసారాంబాగ్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మలక్‌పేట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…ఓల్డ్ మలక్‌పేట శంకర్‌నగర్‌కు చెందిన మోసిన్, భార్య తల్లిదండ్రులు, బావమరిది హబీబ్(21)తో కలిసి మూసారాంబాగ్ చౌరస్తాలో యాచిస్తూ జీవిస్తున్నాడు. గర్భంతో ఉన్న భార్యతో మోసిన్ తరచూ గొడవపడుతుండేవాడు. దీంతో తన అక్కతో గొడవ పడటం మానుకోవాలని, లేకుంటే అంతుచూస్తానని హబీబ్.. తన బావ మోసిన్‌ను హెచ్చరించాడు. నన్ను చంపడం కాదు….నిన్నే చంపేస్తానంటూ వెంట తెచ్చుకున్న కత్తితో హబీబ్ కడుపులో విచక్షణా రహితంగా పొడిచాడు. దీంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, వారు అక్కడికి చేరుకొని హబీబ్‌ను ఉస్మానియా దవాఖానకు తరలించగా అప్పటికే మృతిచెందాడు. సంఘటన స్థలాన్ని ఈస్ట్ జోన్ డీసీపీ, జాయింట్ కమిషనర్ రమేశ్, మలక్‌పేట ఏసీపీ వెంకటరమణ, సీఐ సుబ్బారావులు సందర్శించి హత్యపై ఆరా తీశారు. ఈ మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
Pay Commission | బేసిక్ పేనా.. అలవెన్సులా.. ఏది పెరిగితే ఆర్థిక భద్రత ఎక్కువ..?
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

