బైక్ను దొంగిలించేందుకు యత్నం.. సెక్యూరిటీ గార్డ్ అప్రమ్తతతో దొరికిపోయారు..
Delhi Police | ఓ ఇద్దరు దొంగలు డెలివరీ బాయ్ బైక్ను దొంగిలించేందుకు యత్నించారు. కానీ ఆ అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డ్ అప్రమత్తంగా ఉండటంతో పోలీసులకు ఆ దొంగలు దొరికిపోయారు. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలోని ఎవరెస్ట్ అపార్ట్మెంట్లో వెలుగు
న్యూఢిల్లీ : ఓ ఇద్దరు దొంగలు డెలివరీ బాయ్ బైక్ను దొంగిలించేందుకు యత్నించారు. కానీ ఆ అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డ్ అప్రమత్తంగా ఉండటంతో పోలీసులకు ఆ దొంగలు దొరికిపోయారు. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలోని ఎవరెస్ట్ అపార్ట్మెంట్లో వెలుగు చూసింది.
ఇవాళ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఓ ఇద్దరు వ్యక్తులు మున్సిపల్ అధికారులమని చెప్పి అపార్ట్మెంట్లోకి ప్రవేశించారు. వారిద్దరూ ఆ అపార్ట్మెంట్లో దొంగతనం చేసేందుకు వెళ్లారు. కానీ భవనాలను తనిఖీ చేస్తున్నట్లు నటించారు. అయితే ఓ డెలివరీ ఏజెంట్ తన బైక్ తాళాలను ఆ వాహనానికే ఉంచి వెళ్లాడు. దీన్ని గమనించిన ఆ ఇద్దరు వ్యక్తులు బైక్ను తీసుకొని పారిపోయేందుకు యత్నించారు. అప్రమత్తమైన బైక్ యజమాని గట్టిగా కేకలు వేయడంతో గేట్ వద్ద కాపలాగా ఉన్న సెక్యూరిటీ గార్డ్ అలర్ట్ అయ్యాడు. ఇక అతను గేటు మూయడంతో వేగంగా వెళ్లిన బైక్ ఆ గేటు మధ్యలో ఇరుక్కుపోయింది. ఇద్దరిలో ఒకరు పారిపోగా, మరొకరిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

