తన మేకను హత్య చేశారంటూ ఒక మహిళ ఫిర్యాదు

పాట్నా: తన పెంపుడు మేకను పొరుగింటి వ్యక్తి హత్య చేసినట్లు ఆరోపిస్తూ ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బీహార్‌లోని కైమూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. చౌరసీహ్ గ్రామానికి చెందిన రాధా దేవి ఒక మగ మేకను పెంచుతున్నది. ఈ నెల 15న ఆ మహిళ పొలం పనులకు వెళ్లింది. మరోవైపు ఆమె మేక పొరుగున్న ఉన్న సిపు రామ్‌కు చెందిన ఆడ మేక వద్దకు వెళ్లింది. గమనించిన అతడు ఆగ్రహం చెంది కర్రతో ఆ మేకను కొట్టాడు. దీంతో అది చనిపోయింది.
కాగా, పొలంలో ఉన్న రాధా దేవికి ఆమె మేకను రామ్ కొడుతున్న విషయాన్ని కొందరు స్థానికులు చెప్పారు. దీంతో ఆమె పరుగున తన ఇంటికి వచ్చింది. కింద పడి ఉన్న తన మేకను, రామ్ చేతిలో కర్రను రాధా దేవి చూసింది. అతడు ఆమెను హెచ్చరించడంతో చనిపోయిన మేకను తీసుకుని మోహానియా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. తన పెంపుడు జంతువు పట్ల కూర్రత్వంగా ప్రవర్తించి హత్య చేసిన సికు రామ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది.
మరోవైపు రాధా దేవి ఫిర్యాదు మేరకు ఆమె పెంపుడు మేక మరణంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మోహానియా పోలీసులు తెలిపారు. మేక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పశు వైద్యశాలకు తరలించినట్లు చెప్పారు. రిపోర్ట్ వచ్చిన తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

