తస్మాత్ జాగ్రత్త!

దేశమంతా కరోనాతో కకావికలమవుతున్న వేళ సైబర్ నేరస్తులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రజల బలహీనతలే తమ బలంగా గాలం విసురుతున్నారు.కొవిడ్ టెస్టింగ్, వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్, ఔషధాల పేరుమీద లక్షల్లో అకౌంట్లను కొల్లగొడుతున్నారు. ఈ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అధికారులు.
టెస్టింగ్ పేరు మీద వచ్చే సందేశాలను గుడ్డిగా నమ్మొద్దు. కొవిడ్ టెస్ట్ చేస్తామంటూ ఆన్లైన్ పేమెంట్ వసూలు చేస్తున్నారు కొందరు. కొన్ని సందర్భాల్లో శాంపిల్ సేకరణ కోసం ఇంటికే వస్తున్నారు. శాంపిల్ సేకరించి, ఫీజు వసూలు చేసుకొని వెళ్లిపోతున్నారు. ఆ తర్వాత వారాలు దాటినా ఏ రిపోర్ట్ రాదు. ఇలాంటి కేసులు చాలా చోట్ల నమోదవుతున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్)లో అప్రూవ్ చేసిన డయాగ్నోస్టిక్ సెంటర్స్‌లోనే పరీక్షలు చేసుకోవాలి. ఏదైనా పరీక్షా కేంద్రం నుంచి సందేశం వస్తే.. ఆ పేరు ఐసీఎమ్ఆర్ ఆమోదించిన జాబితాలో ఉందేమో చెక్ చేయాలి.
వెంటనే వద్దు
ఆన్లైన్లో వ్యాక్సినేషన్ స్లాట్ బుక్ చేసుకుంటున్నారా! ఇందుకోసం ప్లేస్టోర్‌లోకి వెళ్లి యాప్‌లు డౌన్లోడ్ చేస్తున్నారా! తొందరపడి ఏదో ఒకటి డౌన్లోడ్ చేసేయకండి. ప్రభుత్వం ప్రకటించిన కో-విన్ పేరుతో రకరకాల యాప్స్ ప్లేస్టోర్‌లో తిష్టవేశాయి. వాటిని డౌన్లోడ్ చేసుకున్నారా, అంతేసంగతులు. ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ ద్వారా, ఆరోగ్యసేతు యాప్ ద్వారా మాత్రమే వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోండి.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

