ఘజియాబాద్ : యువకుల కేరింతలు, కోలాహలం నడుమ సాగిన బ్యాచ్‌లర్ పార్టీలో విషాదం చోటుచేసుకుంది. ఘజియాబాద్‌లో మంగళవారం జరిగిన బ్యాచ్‌లర్ పార్టీలో వేడుకలు శ్రుతిమించి సెలబ్రేటరీ ఫైరింగ్ ఓ యువకుడి ప్రాణాలమీదకు తెచ్చింది. ఫ్రెండ్ బ్యాచ్‌లర్ పార్టీలో పాల్గొని మృత్యువాత పడిన యువకుడిని సూరజ్ రాయ్‌గా గుర్తించారు. బాధితుడి తండ్రి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
బాధితుడి స్నేహితుడు హిమాన్షు శర్మ కోసం ఫ్రెండ్స్ బ్యాచ్‌లర్ పార్టీని ఏర్పాటు చేశారు. పార్టీలో స్నేహితుల్లో ఒకరు గాలిలోకి కాల్పులు జరపగా గురితప్పి సూరజ్ రాయ్‌కు తూటాలు తగిలాయి. బాధితుడి స్నేహితులు హుటాహుటిన అతడిని వైశాలిలోని మ్యాక్స్ ఆస్పత్రికి తరలించగా బుల్లెట్ గాయాలతో మరణించాడని పోలీసులు తెలిపారు.