పహాడీషరీఫ్ : ఓ మహిళపై గుర్తు తెలియని ఆటో డ్రైవర్ లైంగికదాడి చేయడానికి ప్రయత్నించిన ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై మధుసూధన్ వివరాల ప్రకారం వట్టేపల్లికి చెందిన మహిళ (35) కాటేదాన్‌లోని ఓ పంక్షన్హాల్లో పని చేస్తుంది. సోమవారం రాత్రి ఇంటికి వెళ్లడానికి ఆటో ఎక్కింది.
సదరు ఆటో డ్రైవర్ వట్టేపల్లికి కాకుండా జల్పల్లి వైపు తీసుకెళ్లాడు. కార్గొరోడ్డు వద్ద ఆటోలో చేయి పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడు. లైంగికదాడికి యత్నించాడు . ఆమె కేకలు వేయడంతో వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఆటోలో డ్రైవర్ కాకుండా మరో వ్యక్తి ఉన్నట్లు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. అదే రోజు కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.