సరిగా కూర్చోమన్నందుకు.. టీచర్‌పై ఇనుప రాడ్‌తో విద్యార్థి దాడి

న్యూఢిల్లీ: తరగతిలో సరిగా కూర్చోమన్నందుకు ఒక విద్యార్థి ఇనుప రాడ్‌తో టీచర్‌పై దాడి చేశాడు. దీంతో ఆ ఉపాధ్యాయుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలోని రాన్హోలా ప్రాంతం బాప్రోలాలోని ప్రభుత్వ బాలుర సీనియర్ మాధ్యమిక పాఠశాలలో శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. 11వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి క్లాస్‌కు ఆటంకం కలిగిస్తున్నాడు. గమనించిన ఉపాధ్యాయుడు సరిగా కూర్చోవాలని, అల్లరి చేయవద్దని చెప్పారు.
దీనిపై ఆగ్రహించిన ఆ విద్యార్థి క్లాస్ అనంతరం ఇనుప రాడ్‌తో ఆ టీచర్‌పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఆ టీచర్ నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. స్కూల్ యాజమాన్యం ఫిర్యాదుతో ఆ విద్యార్థిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు.
కాగా, టీచర్‌పై దాడి చేసిన 21 ఏండ్ల విద్యార్థి లతిత్ 11వ తరగతి రెండుసార్లు ఫెయిల్ అయ్యాడని, మరోసారి ఆ తరగతి చదువుతున్నట్లు స్కూల్ అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Delhi
- iron rod
- sit properly
- Student
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

