Actress attack case | చంపేస్తానంటూ.. దోపిడి చేసి దాడికి పాల్పడ్డాడు : షాలూ చౌరాషియా

కొండాపూర్ : కేబీఆర్ పార్కులో వాకింగ్ వెళ్ళిన నటి షాలు చౌరాషియాపై దాడికి సంబంధించిన వివరాలను బుధవారం కొండాపూర్‌లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గత మూడు సంవత్సరాలుగా కేబీఆర్ పార్కులో వాకింగ్ చేస్తున్నా ను. రోజు మాదిరిగానే సీవీఆర్ గేట్ సమీపంలో కారు పార్క్ చేసి సాయంత్రం 6 గంటల సమయంలో వాకింగ్‌కు వెళ్లాను.
రాత్రి 8:15 గంటల సమయంలో మెయిన్‌గేట్ వద్దకు వెళ్ళి తిరిగి వస్తుండగా వెనుకాల నుంచి వచ్చిన ఆగంతకుడు నోట్లో గుడ్డ కుక్కి కుడివైపు ఉన్న పొదలవైపు ఒక్కసారిగా లాక్కెళ్లడంతో షాక్‌కు గురయ్యాను. ఆగంతకుడికి డబ్బులు ఇస్తానని తెలుగులో చెప్పడంతో ఒక చేయిని వదిలేసాడు.
ఫోన్ పే చేస్తున్నట్లు తెలిపి డయల్ 100కు రెండు సార్లు డయల్ చేయగా, గమనించిన ఆగంతకుడు సెల్‌ఫోన్ లాగేసుకుని దాడి చేశాడు. హెల్ప్ హెల్ప్ అంటూ అరుస్తుండగా చేతులు, ముఖంపై బలంగా దాడి చేసి బండరాయిపైకి తోసేయగానే కళ్లు బైర్లు కమ్మాయి.
కొద్దిసేపటకి తేరుకుని చూసేటప్పటికీ బండరాయితో మొహంపై కొట్టి చంపేందుకు ప్రయత్నిస్తున్న వాడి ప్రైవేట్ పార్ట్స్‌పై పై మోచేతితో బలంగా గుద్ది మెయిన్ రోడ్డు వైపు ఉన్న ఫెన్సింగ్ వద్దకు చేరుకున్నాను. ఫెన్సింగ్‌పై నుంచి వెళ్ళకుండా మూడు సార్లు అడ్డుకున్నప్పటికీ దానిపై నుంచి దూకి హెల్ప్ అని అరవడంతో పక్కనే ఉన్న కాఫీ షాపులో పని చేసేవారు వచ్చారని తెలిపారు.
తనకు శత్రువులు ఎవరు లేరని, ఎవరిపై అనుమానం లేదన్నారు. కేబీఆర్ పార్క్‌లో లైటింగ్ అమర్చాలని, ఎఫ్డీసీ అధికారులకు సూచించారు, సమయానికి పోలీసులు స్పందించారని, వారికి సహకరిస్తానన్నారు. తన చేతికి ఉన్న డైమండ్ రింగ్, సెల్‌ఫోన్‌ను గుర్తించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

