లైంగిక వేధింపుల కేసు : నటుడు విజయ్ బాబుపై అరెస్ట్ వారెంట్ జారీ
లైంగిక వేధింపుల కేసులో మళయాళ నటుడు, నిర్మాత విజయ్ బాబుపై అరెస్ట్ వారెంట్ జారీ తర్వాత కేరళ పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు.
తిరువనంతపురం : లైంగిక వేధింపుల కేసులో మళయాళ నటుడు, నిర్మాత విజయ్ బాబుపై అరెస్ట్ వారెంట్ జారీ తర్వాత కేరళ పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు. విజయ్ బాబు తనపై లైంగిక దాడులకు పాల్పడటంతో పాటు వేధింపులకు గురిచేశాడని వర్ధమాన నటి ఫిర్యాదు చేయడం మళయాళ సినీ పరిశ్రమలో కలకలం రేపింది. ఎర్నాకుళంలోని స్ధానిక కోర్టు విజయ్ బాబుపై అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ చేయనున్నారు.
నేరాలపై విచారణ ఎదుర్కొనేందుకు నిందితులను అరెస్ట చేసి స్వదేశాలకు తరలించే ప్రక్రియలో భాగంగా ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేస్తుంది. అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో నటుడు నిర్మాత విజయ్ బాబు ఫోటోలు, కేసు వివరాలు అంతర్జాతీయ క్రిమినల్ పోలీసు సంస్ధ (ఇంటర్పోల్) వెబ్సైట్లో ప్రత్యక్షం కానున్నాయి. రెడ్ కార్నర్ నోటీస్ జారీ కాగానే విజయ్ బాబును దుబాయ్ పోలీసులు నిర్బంధంలోకి తీసుకుని భారత్కు తరలిస్తారు.
అయితే క్రిమినల్ కేసుల్లో నిందితులను స్వదేశానికి అప్పగించేలా భారత్తో ఒప్పందం చేసుకోని దేశాల్లో విజయ్ బాబు తలదాచుకునే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు. ఇక విజయబాబు ఈ ఏడాది మార్చి 13 నుంచి ఏప్రిల్ 14 వరకూ తనపై లైంగిక దాడులకు పాల్పడ్డాడని, సినిమాల్లో మెరుగైన అవకాశాలు ఇప్పిస్తానంటూ తన ఇష్టానికి వ్యతిరేకంగా లైంగిక వేధింపులకు గురిచేశాడని బాధితురాలు ఏప్రిల్ 22న పోలీసులకు పిర్యాదు చేసింది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- actor
- Arrest Warrant
- Assault
- issued
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

