Alprazolam | సంగారెడ్డి జిల్లాలో రూ. కోటి విలువ చేసే ఆల్ప్రాజోలం సీజ్..
Alprazolam | సంగారెడ్డి జిల్లాలో రూ. కోటి విలువ చేసే 2.6 కిలోల ఆల్ప్రాజోలం అనే డ్రగ్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఈ డ్రగ్ తయారీకి సంబంధించిన ముడి పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ వివరాలను వెల్లడించారు.
Alprazolam | సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలో రూ. కోటి విలువ చేసే 2.6 కిలోల ఆల్ప్రాజోలం అనే డ్రగ్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఈ డ్రగ్ తయారీకి సంబంధించిన ముడి పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ వివరాలను వెల్లడించారు.
గుమ్మడిదల పోలీసు స్టేషన్ పరిధిలోని కొత్తపల్లి గ్రామ శివారులో నిషేధిత ఆల్ప్రాజోలం తయారు చేస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో టీజీ న్యాబ్, సంగారెడ్డి జిల్లా పోలీసులు కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించారు. రూ. కోటి విలువ చేసే ఆల్ప్రాజోలం, దాని తయారీకి కావాల్సిన ముడిపదార్థాలు, యంత్రాలు సీజ్ చేసినట్లు వివరించారు.
నిందితులు గోసుకొండ అంజిరెడ్డి, ప్రభాకర్ గౌడ్, క్యాసారం రాకేశ్‌ను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నిషేధిత ఆల్ప్రాజోలం తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఇక కొత్తపల్లిలో వ్యవసాయ భూమిని లీజ్‌కు తీసుకుని, అందులో కోళ్ల ఫారం నడుపుతున్నారు. కోళ్ల ఫారం చాటున ఆల్ప్రాజోలం తయారీ చేస్తున్నారు. ఈ డ్రగ్ తయారీకి కావాల్సిన ముడి పదార్థాలను అంజిరెడ్డి బాలానగర్‌లో కొనుగోలు చేస్తున్నట్లు విచారణలో తేలింది. కెమిస్ట్ క్యాసారం రాకేశ్ సహాయంతో ఆల్ప్రాజోలం తయారు చేస్తున్నారు. ప్రభాకర్ గౌడ్ ఆ డ్రగ్‌ను కల్లు దుకాణాలకు విక్రయిస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

