Chhattisgarh | అనాథ చిన్నారులను చితక్కొట్టిన మహిళా ఆఫీసర్.. కలెక్టర్ సీరియస్
Chhattisgarh | రాయ్పూర్ : అన్నెంపున్నెం ఎరుగని ఇద్దరు చిన్నారులపై ఓ మహిళా ఉద్యోగిని దారుణానికి పాల్పడింది. అనాథ పిల్లలైన ఆ ఇద్దరి జట్టు పట్టుకొని చితక్కొట్టింది. మంచంపై ఎత్తేసి హింసించింది. ఈ దారుణ ఘటన ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లాలో వెలుగు చూసింది.
Chhattisgarh | రాయ్పూర్ : అన్నెంపున్నెం ఎరుగని ఇద్దరు చిన్నారులపై ఓ మహిళా ఉద్యోగిని దారుణానికి పాల్పడింది. అనాథ పిల్లలైన ఆ ఇద్దరి జట్టు పట్టుకొని చితక్కొట్టింది. మంచంపై ఎత్తేసి హింసించింది. ఈ దారుణ ఘటన ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. అనాథలైన 6 సంవత్సరాల లోపు చిన్నారులకు కాంకేర్ జిల్లాలోని అడాప్షన్ సెంటర్లో ఆశ్రయం కల్పిస్తున్నారు. అయితే అక్కడ పని చేసే ప్రోగ్రాం మేనేజర్ సీమా ద్వివేది మాత్రం పిల్లల పట్ల క్రూరంగా ప్రవర్తించారు. ఓ ఇద్దరు చిన్నారులను మానసికంగా హింసించింది. ఆ పిల్లల జుట్టు పట్టుకుని చితక్కొట్టింది. అనంతరం వారిని మంచంపై ఎత్తేసింది. ఈ దారుణ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. పిల్లలపై దాడి చేసిన సమయంలో అటుగా వచ్చిన ఇద్దరు ఉద్యోగులు కూడా ద్వివేదిని అడ్డుకోలేదు.
మొత్తానికి ఈ వీడియో బయటకు రావడంతో కాంకేర్ కలెక్టర్ డాక్టర్ ప్రియాంక శుక్లా సీరియస్గా స్పందించారు. అడాప్షన్ సెంటర్ ప్రోగ్రాం మేనేజర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. గతంలో ఆ సెంటర్ ఉద్యోగులు సీమ ద్వివేది ప్రవర్తన బాగాలేదని, మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధి శాఖకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

