వనపర్తి : జిల్లాలోని గోపాలపేట మండలం చెన్నారంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన రాములుకు కుమారుడు ఉన్నాడు. అతను చంద్రకళ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే చంద్రకళపై మామ రాములు కన్ను పడింది. కామంతో కోడలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెను బలవంతంగా లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు. దీంతో కోడలు చంద్రకళ.. ఆ దృశ్యాలను తన మొబైల్లో చిత్రీకరించింది.
ఇక మామ వేధింపులు తాళలేక.. అతనిపై కర్రతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. స్థానికులు రాములును ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలోనే చనిపోయాడు. ఆస్తి కోసమే రాములును చంద్రకళ చంపిందని అతని సోదరులు, బంధువులు ఆరోపిస్తున్నారు. రాములు సోదరుడి ఫిర్యాదు మేరకు గోపాల్పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.