దళిత యువకుడు దారుణ హత్య.. ఆమెను ప్రేమించడమే నేరమా..?
బెంగళూరు : ఓ దళిత యువకుడు.. ముస్లిం అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. కానీ వారి ప్రేమను అమ్మాయి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. అతను ముస్లిం యువతిని ప్రేమించడమే నేరమైంది. దీంతో దళిత యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని కాలబురాగి జిల్లాలో చోటు చేసుకుంది.
కాలబురాగి జిల్లాలోని భీమానగర్‌కు చెందిన విజయ్ కాంబ్లే(25).. ఓ ముస్లిం యువతిని గత కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయం యువతి సోదరులకు తెలియడంతో కాంబ్లేను హెచ్చరించారు. అయినప్పటికీ వీరిద్దరి మధ్య సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో యువతి సోదరుడు.. కాంబ్లే ఇంటికి చేరుకుని బెదిరించాడు. తన సోదరితో మాట్లాడితే నీ కుమారుడి తల నరికేస్తాను అని విజయ్ తల్లిని బెదిరింపులకు గురి చేశాడు.
అయితే ఇటీవల విజయ్‌కు గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ చేసి బయటకు రావాలని చెప్పారు. దీంతో కాంబ్లే బయటకి వెళ్లగా.. కత్తితో పొడిచి చంపారు. సమాచారం అందుకున్న విజయ్ తల్లి ఘటనాస్థలికి చేరుకుని బోరున విలపించారు. తన కుమారుడిని ముస్లిం యువతి సోదరులే హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాంబ్లేను హత్య చేసిన షాహుద్దీన్, నవాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరితో పాటు ఆమె కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారిస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాచారంలో తక్షణమే మైనింగ్ తవ్వకాలు ఆపాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
PM Modi | ఢిల్లీలో మోదీతో పోలండ్ ప్రధాని భేటీ.. ఇండియా-పోలండ్ మధ్య కీలక ఒప్పందాలు
FMG Doctors | ఎఫ్ఎంజీ వైద్యుల నిరసన.. అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో
Man Dragged On Car Roof | వ్యక్తి చేతులను కారు విండోలో ఇరికించి రూఫ్‌పై తీసుకెళ్లి.. వాహనంతో తొక్కి హత్య
Akka Trailer | స్త్రీల రాజ్యమేలుతున్న పెన్నురు గడ్డపై పవర్ వార్.. కీర్తి సురేష్ ‘అక్క’ ట్రైలర్ అదుర్స్!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

