గ్రామపెద్దగా గెలిచినందుకు సంబరాలు.. తూటా తగిలి 13 ఏళ్ల బాలుడి మృతి
13yr old boy dead | గ్రామంలో జరిగిన ఎన్నికల్లో ఒక వ్యక్తి విజయం సాధించాడు. అతని అనుచరులంతా కలిసి సంబరాలు చేసుకోవడం మొదలు పెట్టారు. ఇలా సంబరాలు చేసుకోవడంపై రాష్ట్ర పోలీసు శాఖ నిషేధం విధించినా

పట్నా: గ్రామంలో జరిగిన ఎన్నికల్లో ఒక వ్యక్తి విజయం సాధించాడు. అతని అనుచరులంతా కలిసి సంబరాలు చేసుకోవడం మొదలు పెట్టారు. ఇలా సంబరాలు చేసుకోవడంపై రాష్ట్ర పోలీసు శాఖ నిషేధం విధించినా కూడా వాళ్లు ఆగలేదు. ఈ వేడుకల్లో భాగంగా ఫుల్లుగా మందు కొట్టిన ఒక వ్యక్తి తుపాకీ తీసుకొని గాల్లో పేలుస్తూ సంతోషం వ్యక్తం చేశాడు. ఉత్తర భారతదేశంలో పలు రాష్ట్రాల్లో ఇలా తుపాకీ పేల్చి సంబరాలు చేసుకోవడం జరుగుతూంటుంది.
బిహార్‌లో తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. గయలోని ఒక గ్రామ ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి అనుచరులు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి తుపాకీ పేలుస్తూ గంతులేశాడు. అయితే దురదృష్టవశాత్తూ ఆ తుపాకీ తూటా తగిలి ఒక 13 ఏళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. సదరు బాలుడు ఇంటి ముందు నిలబడి ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
అయితే ఘటనపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని సమాచారం. ఈ ఘటనపై స్థానిక పోలీసు అధికారికి షోకాజ్ నోటీసు పంపినట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆదిత్య కుమార్ తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Bihar
- Bihar Village
- Crime news
- Gaya
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

