Warangal | లైంగికదాడి కేసులో 10 సంవత్సరాల జైలు శిక్ష
లైంగికదాడి కేసు | బాలికను పెండ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం కూడా ఏర్పరచుకొని చివరకు ముఖం చాటేసిన వ్యక్తికి 10 సంవత్సరాల జైలు శిక్ష, వేయి రూపాయల జరిమానా విదిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

వరంగల్ లీగల్ : బాలికను పెండ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం కూడా ఏర్పరచుకొని చివరకు ముఖం చాటేసిన వ్యక్తికి 10 సంవత్సరాల జైలు శిక్ష, వేయి రూపాయల జరిమానా విదిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
ఈ కేసులో బాధితురాలి పక్షాన వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెరుకు సత్య నారాయణ కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామానికి చెందిన బాలిక వారి బంధువుల వివాహ సమయంలో నిందితునితో పరిచయం ఏర్పడుతుంది.
మందమర్రి పట్టణానికి చెందిన మాటూరి సుమన్ అనే నిందితుడు పరిచయాన్ని కాస్త ప్రేమగా మార్చి,పెండ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో శారీరక సంబంధం ఏర్పరచుకున్నాడు.
కొద్దిరోజుల తర్వాత మొఖం చాటేసి బాలికను మోసం చేయడంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై హన్మకొండ స్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు.
సాక్ష్యాధారాలను పరిశీలించిన నాలుగో అదనపు జిల్లా స్థాయి న్యాయస్థానం నిందితుడు ఉద్దేశపూర్వకంగా నేరం చేశాడని భావించి 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

