ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

మూసాపేట (మహబూబ్‌నగర్) : మూసాపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. ఎస్ఐ పర్వతాలు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. జానంపేటకు చెందిన కావలి రాములు (35)కు కొంతకాలంగా తిమ్మాపూర్‌కు చెందిన వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆ విషయంపై పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. మరో సారి తప్పు జరుగకుండా చూస్తానని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. అయితే గురువారం తెల్లవారుజామున కావలి రాములు నేరుగా ఆ మహిళ ఇంటికే వెళ్లడంతో క్షణికావేశానికి గురైన ఆమె భర్త పట్టుకొని కట్టేసి కొట్టడంతో అక్కడికి అక్కడే మృతి చెందాడు. దాడి చేసిన వారిలో భర్తతో పాటు మరో ముగ్గురు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

