కావాల్సిన పదార్థాలు
బీట్రూట్: అర ముక్క
పుచ్చకాయ తెల్లని భాగం ముక్కలు : రెండు కప్పులు
పంచదార : కప్పు
బటర్ : రెండు ముక్కలు
బ్రెడ్లు: ఆరు
తయారు చేసే విధానం
ముందుగా సుమారు అర పుచ్చకాయ తరిగి అందులోని తెల్లటి భాగాన్ని ముక్కలుగా చేసుకోవాలి ఇవి సుమారు రెండు కప్పుల దాకా అవుతాయి. బీట్రూట్ను కూడా చెక్కు తీసుకొని అంగుళం అంత ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండిటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అది నీరు నీరుగా ఉండే జావలా తయారవుతుంది. బీట్రూట్ వేయడం వల్ల ఎరుపు రంగు కూడా వస్తుంది. ఇప్పుడు పొయ్యి మీద బాణలీ పెట్టి ఈ మిశ్రమాన్ని అందులో వేయాలి. గరిటతో తిప్పుతూ బాగా దగ్గరికి వచ్చేలాగా చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు పంచదారను అందులో పోసి మిశ్రమం గట్టి పడేదాకా బాగా కలుపుకోవాలి. దాన్ని తీసి ఒక గాజు జార్లో వేసుకుంటే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేని వాటర్ మిలన్ రిండ్ జామ్ సిద్ధం అయిపోతుంది. ఇప్పుడు బ్రెడ్ మీద బటర్ రాసి దానిపైన జామ్ రాసి రెండు ముక్కలను జత చేసి మధ్యకు త్రికోణాకృతిలో కత్తిరిస్తే శాండ్విచ్ రెడీ!
ఎం.బాలరాయుడు
పాకశాస్త్ర నిపుణురాలు