కావలసిన పదార్థాలు
గుడ్లు: నాలుగు, తరిగిన పాలకూర: ఒక కప్పు, ఉల్లిగడ్డ: ఒకటి, మిరియాల పొడి: అర టీస్పూన్, ఉప్పు: తగినంత, నూనె: సరిపడా, కొత్తిమీర: కొద్దిగా
తయారీ విధానం
స్టవ్‌మీద పాన్ పెట్టి నూనెవేసి వేడయ్యాక తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. అవి దోరగా వేగిన తర్వాత పాలకూర తురుము వేసి ఐదు నిమిషాలపాటు మగ్గనిచ్చి దింపేయాలి. ఇప్పుడు ఒక గిన్నెలో గుడ్లు కొట్టి మిరియాల పొడి, ఉప్పు, కొత్తిమీర తురుము, ముందుగా వేయించిన పాలకూర మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి నూనెవేసి వేడయ్యాక గుడ్ల మిశ్రమాన్ని వేసి రెండువైపులా కాల్చుకుంటే పాలక్ ఆమ్లెట్ సిద్ధం.