ఈసారి నెక్ట్స్ లెవల్లో..
జాంబీరెడ్డి, హను-మాన్, మిరాయి వంటి సూపర్ నేచురల్ థ్రిల్లర్స్‌లో నటించి సూపర్‌హీరో ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు హీరో తేజా సజ్జా. త్వరలో ఆయన మరో సూపర్ నేచురల్ థ్రిల్లర్‌తో రాబోతున్నారు.
జాంబీరెడ్డి, హను-మాన్, మిరాయి వంటి సూపర్ నేచురల్ థ్రిల్లర్స్‌లో నటించి సూపర్‌హీరో ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు హీరో తేజా సజ్జా. త్వరలో ఆయన మరో సూపర్ నేచురల్ థ్రిల్లర్‌తో రాబోతున్నారు. ఆ సినిమానే ‘జాంబీరెడ్డి 2 నెక్ట్స్ లెవెల్’. ఆదివారం తేజా సజ్జా పుట్టినరోజు సందర్భంగా ‘జాంబీరెడ్డి’ ఫ్రాంచైజీలో రెండో భాగాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘జాంబీరెడ్డి’తో జాంబీ ప్రపంచాన్ని తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సీక్వెల్‌కు క్రియేటర్‌గా వ్యవహరిస్తుండగా, సుపర్ణ్ ఎస్.వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మింస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, నేపాలీ, జపనీస్ భాషల్లో విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఆదివారం టైటిల్ గ్లింప్స్‌ని విడుదల చేశారు. ఫ్లైఓవర్ పైనుంచి ఓ జాంబీ ట్రక్కుపై పడటం.. ‘జాంబీస్ ఆర్ బ్యాక్’ అనే క్యాప్షన్‌తో గ్లింప్స్ మొదలైంది. గ్లింప్స్ ఆద్యంతం జాబీలతో పోరాడుతూ తేజా సజ్జా కనిపించారు. ఈ సారి కథ, యాక్షన్, స్కేల్ మరింత ఇంటెన్స్‌గా ఉండబోతున్నట్టు గ్లింప్స్ చెబుతున్నది. కన్నడ అగ్ర నటుడు ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో షానాయ కపూర్ కథానాయిక. ఈ చిత్రానికి కెమెరా: అభినందన్ రామానుజం, సంగీతం: గౌర హరి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

