Vikatakavi | ‘దర్శకుడిగా నాకు అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సిరీస్ ‘వికటకవి’. ఈ కథలో చాలా లేయర్లుంటాయి. 1940-70 మధ్యకాలంలో జరిగే కథ ఇది. ఆ ప్రపంచాన్ని క్రియేట్ చేసి తెరకెక్కించడం తెలియని కిక్‌ని ఇచ్చింది. కంటెంట్ పరంగా రాయల్ లుక్‌లో ఉండే ఈ సిరీస్‌లో మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి.’ అని దర్శకుడు. ప్రదీప్ మద్దాలి చెప్పారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘వికటకవి’ సిరీస్ ఈ నెల 28న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘తెలంగాణకు చెందిన అమరగిరి సంస్థానం నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టడం వల్ల ఆ సంస్థానం మునిగిపోతుంది. ఈ నేపథ్యంలో ఫిక్షనల్‌గా ఈ కథ సాగుతుంది. షోయబ్ ఈ సిరీస్‌కి ఛాయాగ్రహణం అందించారు. ఈ కథకు ఆయనే న్యాయం చేయగలరు. అందుకే ఆయన్ను పంజాబ్ నుంచి రప్పించాం. మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా మనసుపెట్టి పనిచేశారు. ఫిక్షనల్ డిడెక్ట్వ్ కథ కాబట్టి ఈ సిరీస్‌కి ‘వికటకవి’ అని పేరు పెట్టాం.’ రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ సిరీస్‌లో నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ముఖ్యతారలు.