నిత్య స్ఫూర్తి ఎన్టీఆర్
తెలుగు దిగ్గజ నటుడు ఎన్టీఆర్ 27వ వర్థంతి నేడు. ఈ సందర్భంగా దర్శకుడు వైవీఎస్ చౌదరి ఎన్టీఆర్ తనకు ఇచ్చిన స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు.
తెలుగు దిగ్గజ నటుడు ఎన్టీఆర్ 27వ వర్థంతి నేడు. ఈ సందర్భంగా దర్శకుడు వైవీఎస్ చౌదరి ఎన్టీఆర్ తనకు ఇచ్చిన స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు. ఒక అభిమానిగా ఆయన అనుభవాలను పంచుకున్నారు. వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ…‘ఎన్టీఆర్ గారి నుంచి స్ఫూర్తి పొంది సినీ, రాజకీయ రంగాల్లో ఎంతోమంది జీవితాన్ని పొందారు. ఆయన అందించిన చైతన్యం వల్ల, అవకాశాల వల్ల ఎందరో గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ సినీ, రాజకీయ రంగాల్లో ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించారు. వారు ఎదిగేందుకు కారణమయ్యారు. ఎన్టీఆర్ అభిమానిగా గుడివాడలో అభిమాన సంఘాన్ని ఏర్పాటుచేశాను.
ఆ తర్వాత పరిశ్రమకు వచ్చి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాను. ఇలా మనకు స్ఫూర్తినిచ్చిన వారి పట్ల కృతజ్ఞత ఉండాలనేది నా అభిప్రాయం. అందుకే ప్రతి ఏటా జయంతికి, వర్థంతికి ఎన్టీఆర్‌ను ప్రత్యేకంగా స్మరిస్తాను. నా సినిమా ప్రారంభ, ముగింపులు ఆయన ఫొటోతోనే ఉండటం అందరికీ గుర్తే. మా సినిమాలకు కొండంత అండగా ఎన్టీఆర్ ఉండాలని మా కోరిక’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- NTR memory
- yvs chowdary
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

