అలాంటి లెక్కలు వేసుకోను!

‘సినీ పరిశ్రమలో అడుగుపెట్టడమే అదృష్టంగా భావిస్తున్నా. కెరీర్ పరంగా బాధపడిన సందర్భాలు లేవు. జయాపజయాలతో సంబంధం లేకుండా నా ప్రయాణాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నా’ అని అన్నారు వైవీఎస్ చౌదరి. ‘దేవదాసు’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘సీతయ్య’ లాంటి చిత్రాలతో దర్శకనిర్మాతగా చక్కటి విజయాల్ని అందుకున్న వైవీఎస్ చౌదరి జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, సంగీతం, సాహిత్యాల కలబోతగా తెలుగు వారి పౌరుషాన్ని చాటిచెప్పే శక్తివంతమైన కథాంశంతో తదుపరి సినిమా చేయబోతున్నా. అన్ని హంగులతో కూడిన చక్కటి ప్రేమకథగా ఉండబోతుంది. ఈ సినిమా ద్వారా కొత్త నాయకానాయికల్ని పరిచయం చేయబోతున్నా. తెలుగమ్మాయిని హీరోయిన్గా తీసుకోవాలనుకుంటున్నా. దర్శకుడు అనేవాడు మూసధోరణికి పరిమితమైపోకుండా అన్ని రకాల కథల్ని తీయాలన్నది నా సిద్ధాంతం. ఆ ఆలోచనకు అనుగుణంగానే విభిన్నమైన కథాంశాలతో సినిమాల్ని రూపొందిస్తున్నా. మార్కెట్ లెక్కలు, అంచనాలు, క్యాలికులేషన్స్ను దృష్టిలో పెట్టుకొని నేనెప్పుడూ సినిమాలు చేయను.కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టిన తర్వాత తదుపరి సినిమా చిత్రీకరణ మొదలుపెడతా’ అని అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

