Yellamma Movie | ‘బలగం’ దర్శకుడి కొత్త మూవీ.. ‘ఎల్లమ్మ’ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన దిల్ రాజు
Yellamma | గత ఏడాది చిన్నసినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం ‘బలగం’ (Balagam). తెలంగాణలోని కుటుంబ మూలాలు, భావోద్వేగాల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
Yellamma | గత ఏడాది చిన్నసినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం ‘బలగం’ (Balagam). తెలంగాణలోని కుటుంబ మూలాలు, భావోద్వేగాల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వం (డెబ్యూ) వహించిన ఈ చిత్రంలో ప్రియదర్శి (Priyadarshi), కావ్య కల్యాణ్ రామ్ హీరోహీరోయిన్లుగా నటించగా.. వేణు ఎల్దండి, మురళీధర్ గౌడ్, జయరామ్, రూప, రచనా రవి కీలక పాత్రల్లో కనిపించారు.
అయితే ఈ సినిమా అనంతరం అందరిచూపు దర్శకుడు వేణుపై పడిన విషయం తెలిసిందే. బలగం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వేణు ఎలాంటి సినిమా తీయబోతున్నాడు అని సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తుండగా.. తన తర్వాతి ప్రాజెక్ట్ ‘ఎల్లమ్మ’ (Yellamma) అంటూ అందరికి షాక్ ఇచ్చాడు. అయితే ‘ఎల్లమ్మ’ అంటూ వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది ఎవరు లీడ్ రోల్ చేయబోతున్నారు అనేది సస్పెన్స్‌గా మారింది. అయితే ఈ సినిమాలో నాని (Nani) లేదా నితిన్ (Nitiin) హీరోగా నటించబోతున్నట్లు సమాచారం.
ఇక ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చాలా రోజులు అయిన ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. ఇదిలావుంటే చాలా రోజుల తర్వాత ఎట్టకేలకు ఈ మూవీకి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. ఒక మూవీ ఈవెంట్లో బలగం వేణుని నిర్మాత దిల్ రాజు అడుగుతూ.. ఎల్లమ్మ ఎప్పుడు ఉంటుందని ప్రశ్న వేస్తాడు. దీనికి వేణు సమాధానమిస్తూ.. సార్ అంతా మీ చేతుల్లోనే ఉంది మీరు ఇప్పుడు మొదలుపెట్టమన్నా స్టార్ట్ చేస్తాను. నవంబర్ నుంచి స్టార్ట్ చేద్దామా అని అడుగగా.. వద్దు సామీ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేద్దాం అంటూ దిల్ రాజు అంటాడు. దీంతో ఈ ప్రాజెక్ట్‌ను ఫిబ్రవరిలో అధికారికంగా లాంఛ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు దిల్ రాజు నిర్మాతగా వ్యవహారించనున్నాడు.
#Yellamma shoot starts in February. But who is the hero? Nani or Nithiin or anyone else? pic.twitter.com/GzLRZI229i
— Aakashavaani (@TheAakashavaani) October 10, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

