Yellamma | ‘ఎల్లమ్మ’లో హీరోగా దేవి శ్రీ ప్రసాద్… దర్శకుడు వేణు ఎల్దండి సంచలన నిర్ణయానికి ఇదే కారణం!
Yellamma | ‘బలగం’ సినిమాతో ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్న దర్శకుడు వేణు ఎల్దండి తన తదుపరి ప్రాజెక్ట్ ‘ఎల్లమ్మ’తో మరోసారి భారీ అంచనాలను సృష్టిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై ఇప్పటికే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడుస్తోంది. ఈ సినిమాలో హీరోగా నాని, నితిన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వంటి స్టార్స్ నటిస్తారని గతంలో ప్రచారం జరిగింది.
Yellamma | ‘బలగం’ సినిమాతో ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్న దర్శకుడు వేణు ఎల్దండి తన తదుపరి ప్రాజెక్ట్ ‘ఎల్లమ్మ’తో మరోసారి భారీ అంచనాలను సృష్టిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై ఇప్పటికే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడుస్తోంది. ఈ సినిమాలో హీరోగా నాని, నితిన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వంటి స్టార్స్ నటిస్తారని గతంలో ప్రచారం జరిగింది. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ, దర్శకుడు వేణు ఈ పాత్ర కోసం దేవి శ్రీ ప్రసాద్‌ని ఎంపిక చేశారు. ప్రపంచవ్యాప్తంగా సంగీత దర్శకుడిగా గుర్తింపు పొందిన దేవి శ్రీ ప్రసాద్… ఈ చిత్రంతో హీరోగా కొత్త ప్రయాణం ప్రారంభించబోతున్నారు. ఇది ఆయన కెరీర్లో కీలక మలుపుగా భావిస్తున్నారు.
ఈ నిర్ణయంపై వస్తున్న సందేహాలకు దర్శకుడు వేణు క్లారిటీ ఇచ్చారు. సినిమాలో తీసుకునే ప్రతి నిర్ణయం కథకు అనుగుణంగానే ఉంటుంది. ‘ఎల్లమ్మ’ కథకు ఒక ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ ఉన్న వ్యక్తి కావాలి. మొదట వేరే నటులను అనుకున్నా… కథ మారుతూ ఉండటంతో దేవి శ్రీ ప్రసాద్ అయితేనే సరిపోతారని భావించాం అని తెలిపారు. కథలోని సహజత్వం , భావోద్వేగాలను ప్రేక్షకులకు బలంగా చేరవేయడానికి దేవి సరైన ఎంపికగా కనిపించారని ఆయన వివరించారు.
బలగంతో గ్రామీణ భావోద్వేగాలను అద్భుతంగా చూపించిన వేణు… ‘ఎల్లమ్మ’లో కూడా అదే మట్టి వాసనను తెరపై ఆవిష్కరించబోతున్నారు. ఈ సినిమా కూడా ఎమోషనల్ డ్రామాగా ఉండబోతుందని సమాచారం. సంగీత దర్శకుడిగా ఎనలేని క్రేజ్ సంపాదించిన దేవి శ్రీ ప్రసాద్‌ని నటుడిగా ఎలా చూపిస్తారు? ఆయన పాత్రలో ఎంతవరకు ఒదిగిపోతారు? అన్న ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది. టాలీవుడ్లో కొత్త ప్రయోగాలలు ఎప్పుడు అందరిలో ఆసక్తిని కలిగిస్తుంటాయనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలో వేణు – దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏది ఏమైన , వేణు ఎల్దండి తీసుకున్న ఈ ధైర్యవంతమైన నిర్ణయం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ‘ఎల్లమ్మ’ సినిమా ద్వారా దేవి శ్రీ ప్రసాద్ నటుడిగా కూడా ప్రేక్షకులను మెప్పిస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

