Yami Gautam | యామీ గౌతమ్ (Yami Gautam).. సినీ ప్రియులకు పరిచయం అవసరం లేని పేరు. మొదట టెలివిజన్ ప్రకటనల్లో కనిపించిన యామీ.. ఆ తర్వాత కొంతకాలానికే వెండితెరపై మెరిసింది. ‘గౌరవం’ చిత్రంతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో అలరిస్తోంది. నటిగా బిజీగా ఉన్న సమయంలోనే రచయిత, దర్శకుడు అయిన ఆదిత్య ధర్ (Aditya Dhar)ను ప్రేమ వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది.
2021 జూన్‌లో ఆదిత్య ధర్‌ను వివాహం చేసుకున్న ఈ నటి.. తాజాగా అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలో తాము తల్లిదండ్రులం కాబోతున్నామంటూ యామీ ధర్ జంట ప్రకటించింది (confirm pregnancy). ‘ఆర్టికల్ 370’ (Article 370) చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఈ జంట ప్రెగ్నెన్సీ ప్రకటన చేసింది. ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, పలువురు సెలబ్రిటీలు యామీ ధర్ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Also Read..
Hemant Soren | ఈడీ స్వాధీనం చేసుకున్న ఆ కారు సోరెన్‌ది కాదు.. ఎవరిదంటే..?
Bomb Threats | చెన్నైలోని ఐదు పాఠశాలలకు బాంబు బెదిరింపులు