జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 25న రిలీజై సంచలన విజయం సాధించింది. అంతకుముందు ‘బాహుబలి-2’ పేరిట ఉన్న రికార్డులను చెరిపేసి తన పేరిట లిఖించుకుంది. రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ల నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రాజమౌళి టేకింగ్, విజన్‌తో మరోసారి మాయ చేశాడు. ఈ చిత్రంతో ఇండియాలో రెండు సార్లు 1000కోట్ల మార్కును టచ్ చేసిన ఏకైక దర్శకుడిగా రాజమౌళి రికార్డు సృష్టించాడు. ఇక నైజాంలో 100కోట్ల షేర్ సాధించిన మొదటి సినిమాగా ‘ఆర్ఆర్ఆర్’ నిలిచింది. ఒక్కటేమిటీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రికార్డులను ట్రిపుల్ఆర్ సాధించింది.
కాగా ఈ చిత్రం శుక్రవారం జపాన్‌లో పెద్ద ఎత్తున రిలీజైంది. ఈ సినిమా కోసం ట్రిపుల్ఆర్ బృందం మూడు రోజులు ముందుగానే వచ్చి జోరుగా ప్రమోషన్స్ చేశారు. శుక్రవారం బుకింగ్స్ కూడా భారీ రేంజ్లో జరిగాయి. కాగా జపాన్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్-5 ఇండియన్ మూవీస్ లిస్ట్ తీస్తే అందులో మూడు సౌత్ చిత్రాలు ఉండటం విశేషం. ‘ముత్తు’, ‘బాహుబలి-2’, ‘దర్బార్’ వంటి సినిమాలు టాప్-5లో మొదటి మూడు ప్లేస్‌లలో ఉన్నాయి. ఆ తర్వాత ‘3-ఇడియట్స్’, ‘ఇంగ్లీష్-వింగ్లీష్’ సినిమాలున్నాయి. అయితే 1995లో వచ్చిన ‘ముత్తు’ సినిమా జపాన్‌లో ఇప్పటికీ హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన ఇండియన్ సినిమాగా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. జపాన్‌లో ఈ సినిమా రూ.26.2 కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది. ఇప్పటివరకు ఈ రికార్డు బ్రేక్ కాలేదంటే విశేషం అనే చెప్పాలి. కాగా రజనీకాంత్‌కు జపాన్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి చాలా మంది ఆ రికార్డు బ్రేక్ అవుతుందని భావిస్తున్నారు. మరి ‘ఆర్ఆర్ఆర్’, ‘ముత్తు’ రికార్డును బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.
Read Also:
Prince Movie Review | ‘ప్రిన్స్’ మూవీ రివ్యూ
పాన్ ఇండియా రిలీజ్‌కు సిద్ధమైన మరో కన్నడ సినిమా.. ఆసక్తిరేకెత్తిస్తున్న ‘KD’ టీజర్
NBK107 | సంక్రాంతి బరిలో బాలయ్య.. మరి ‘మెగా154’ సంగతేంటి?
Bheemla Nayak | ‘భీమ్లానాయక్’ సినిమాకు ఫస్ట్ చాయిస్ ఆ సీనియర్ స్టార్ హీరోనా?