పాన్ ఇండియా రిలీజ్‌కు సిద్ధమైన మరో కన్నడ సినిమా.. ఆసక్తిరేకెత్తిస్తున్న ‘KD’ టీజర్
Kd Movie teaser Released | ప్రస్తుతం ఇండియాలో కన్నడ సినిమాల హవా నడుస్తుంది. ఒకప్పుడు కన్నడ పరిశ్రమ అంటే రీమేక్ సినిమాలు, రోటీన్ సినిమాలు తీసే వారు అని పేరుండేది. అంతేకాకుండా అప్పట్లో ఏ ఇండస్ట్రీలోనూ కన్నడ సినిమాలకు అంతగా గుర్తింపు ఉండేది కాదు.
Kd Movie teaser Released | ప్రస్తుతం ఇండియాలో కన్నడ సినిమాల హవా నడుస్తుంది. ఒకప్పుడు కన్నడ పరిశ్రమ అంటే రీమేక్ సినిమాలు, రోటీన్ సినిమాలు తీసే వారు అని పేరుండేది. అంతేకాకుండా అప్పట్లో ఏ ఇండస్ట్రీలోనూ కన్నడ సినిమాలకు అంతగా గుర్తింపు ఉండేది కాదు. అయితే ఈ లెక్కంత ఒకప్పటి మాట. ‘కేజీఎఫ్’తో లెక్కలన్ని మారిపోయాయి. వంద కోట్ల గ్రాస్లేని కన్నడ ఇండస్ట్రీకి ఏకంగా 1000 కోట్ల గ్రాస్ సాధించి కన్నడ ఇండస్ట్రీ రూపు రేఖలనే మార్చేసింది. ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో చూసిన కన్నడ సినిమాల గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే కంటెంట్ ఉన్న సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తూ బ్లాక్‌బస్టర్ విజయాలను సాధిస్తున్నారు. ఇక ఇప్పటికే ‘777చార్లీ’, ‘విక్రాంత్ రోణ’, ‘కాంతార’ వంటి సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఘన విజయాలు సాధించాయి. కాగా ఇప్పుడు మరో కన్నడ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమైంది.
అర్జున్ సార్జా మేనల్లుడు ధృవ సార్జా హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘KD’. షోమ్యాన్ ప్రేమ్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది. ‘రామాయణ యుద్ధం స్త్రీ కోసం, మహాభారత యుద్ధం రాజ్యం కోసం, ఈ కలియుగ యుద్ధం కేవలం రక్తం కోసం’ అంటూ టీజర్ స్టార్ట్ అయింది. జైల్లో నుండి రిలీజవుతున్న ధృవ సార్జాను చంపడానికి వేల మంది ఎదురు చూస్తున్నట్లు టీజర్లో చూపించారు. అయితే అతనికి స్వాగతం పలకడానికి అంత కంటే ఎక్కువ మంది జైలు దగ్గర ఎదురు చేస్తుంటారు. ధృవ సార్జా ఓ వైపు గ్యాంగ్‌స్టార్‌గా క్రైమ్స్ చేస్తూనే మరో వైపు ప్రజలకు అండగా ఉన్నట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. టీజర్లో చూపించిన యాక్షన్ సన్నివేశాలు కేజీఎఫ్‌ను తలపిస్తున్నాయి. అర్జున్ జన్య నేపథ్య సంగీతం గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కేవీఎన్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. కాగా ఈ చిత్ర రిలీజ్ డేట్‌పై త్వరలోనే ప్రకటన రానుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

