Biggboss Season 5 Telugu | ఈ వారం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది అతడేనా..?
బిగ్ బాస్ 5 తెలుగు (Biggboss Season 5 Telugu)మెల్లమెల్లగా ప్రేక్షకులకు బాగానే చేరువవుతుంది. ఇప్పటి నుంచి టిఆర్పి రేటింగ్ మరింత పెరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు స్టార్ మా (Star Maa) యాజమాన్యం వాళ్లు.

మెల్లమెల్లగా బిగ్ బాస్ 5 తెలుగు (Biggboss Season 5 Telugu) ప్రేక్షకులకు బాగానే చేరువవుతుంది. నెల రోజుల తర్వాత టిఆర్పి రేటింగ్ చూసుకుంటే యావరేజ్ గా బాగానే వస్తున్నాయని స్టార్ మా (Star Maa) యాజమాన్యం సంతృప్తిగా ఉంది. అయితే ఇప్పటి నుంచి మరింత పెరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు వాళ్లు. మరోవైపు ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ శక్తి మేరకు కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే రోజూ గొడవలు పడేలా కూడా చూసుకుంటున్నారు. ముఖ్యంగా కాజల్ లాంటి కంటెస్టెంట్స్ అయితే గొడవ పడడానికి మాట్లాడుతుంటారు.
ఇదిలా ఉంటే ఈ వారం ఏకంగా 9 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. 8 మంది సభ్యులు షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswanth) ను నామినేట్ చేశారు. ఇంట్లో ఎవరితో ఆయన కలవడం లేదు అనే ఒకే ఒక్క కారణం చెప్పి అంతమంది నామినేట్ చేశారు. దాంతో షణ్ముఖ్ బిహేవియర్ లో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఇంట్లో అందరూ ఒక వైపు.. మేము ముగ్గురం ఒక వైపు అన్నట్లు సిరి, జెస్సితో కలిసి తనదైన ఆట మొదలు పెట్టాడు ఈ కుర్రాడు.

ఇదిలా ఉంటే ఈ వారం ఇంటి నుంచి ఎవరు బయటకు వెళ్తారు అనే విషయంపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఏకంగా 9 మంది ఇంటి సభ్యులు నామినేట్ కావడంతో.. ఎవరు ఎలిమినేట్ అవుతారు అని చెప్పడం కష్టంగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న ఓటింగ్ బట్టి చూస్తే యాంకర్ రవి, షణ్ముఖ్ జస్వంత్, మానస్, సన్నీ, విశ్వ, ప్రియా, హమీద కాస్త మందున్నారు. సిరి, జెస్సి, లోబో మాత్రం ఓటింగ్ విషయంలో మిగిలిన వారితో పోలిస్తే వెనుకబడ్డారు.
ఈ సారి ఎక్కువగా డేంజర్ జోన్ లో ఉన్నది లోబో (Lobo), జెస్సి (Jessie). ఈ ఇద్దరిలో ఒకరు ఈ సారి ఇంటి నుంచి బయటకు వస్తారని తెలుస్తోంది. ఎక్కువగా లోబో ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. ఇంట్లో అతని బిహేవియర్ ఎప్పుడూ కాస్త తేడాగా ఉంటుంది అనేది మిగిలిన కంటెస్టెంట్స్ చేసే ముఖ్యమైన కంప్లైంట్. మరీ ముఖ్యంగా అమ్మాయిలతో మనోడి బిహేవియర్ కాస్త తేడాగా ఉంటుంది. ఇదే లోబోకు మైనస్ అయ్యేలా కనిపిస్తోంది. మొదటి మూడు వారాలు వరుసగా అమ్మాయిలు బయటికి వచ్చారు. ఆ తర్వాత వరుసగా అబ్బాయిలు వచ్చేలా కనిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Chaitan Bharadwaj | మహాసముద్రంలో చాలా ట్విస్టులుంటాయి: చేతన్ భరద్వాజ్
Faria abdullah: రోడ్డుపై జాతి రత్నాలు బ్యూటీ తీన్మార్ డ్యాన్స్.. వీడియో వైరల్
MAA Elections | ‘మా’ ఎన్నికలపై నటుడు రవిబాబు సంచలన వ్యాఖ్యలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

