ఓ వైపు ఎంటర్టైనింగ్గా సాగుతూనే మరోవైపు సీరియస్‌గా సాగే బిగ్‌బాస్ షో సీజన్ -6 (Bigg Boss 6 Telugu) లో కాస్త డిఫరెంట్ నడుస్తోందనే చెప్పాలి. నాగార్జున (Akkineni nagarjuna) హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 మొదటి రోజు నుంచి ఎక్కువ సీరియస్‌గా, కొంత ఫన్నీగా సాగుతుంది. కొందరు హౌస్మేట్స్ ఏదో ఒక వాగ్వాదం పెట్టుకుంటే..మరికొందరేమో సైలెంట్‌గా మాకేం తెలియదన్నట్టుగా ఉండిపోతున్నారు. ఇక బిగ్ బాస్ కెప్టెన్సీ కోసం టాస్క్ ఫిక్స్ చేశాడు.
బిగ్‌బాస్ సీజన్ 6లో మొదటి కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ పోటీదారులకు ఇచ్చిన టాస్క్ పేరు కెప్టెన్సీ బండీ (Captaincy bandi). ఈ టాస్క్‌కు జబర్దస్త్ ఫైమా (fima) ఆర్గనైజర్‌గా వ్యవహరించింది. క్లాస్ కేటగిరీ నుంచి గీతూ రాయల్, ఆది రెడ్డి, నేహా చౌదరి, మాస్ కేటగిరీ నుంచి బాలాదిత్య, ఆర్జే సూర్య, మెరీనా-రోహిత్ కెప్టెన్సీ పోటీదారులుగా ఎన్నికయ్యారు. అయితే టాస్క్ జరుగుతున్నపుడు కొందరు హౌస్ మేట్స్ మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది.
ఇచ్చిన టాస్క్‌ను ఎవరు బిగ్ బాస్ రూల్స్ కు లోబడి పూర్తి చేశారు..టాస్క్ పూర్తి చేసే క్రమంలో ఎలాంటి వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి..ఫైనల్‌గా మొదటికెప్టెన్ స్థానాన్ని ఎవరు దక్కించుకున్నారనేదానిపై సస్పెన్స్ పెడుతూ విడుదల చేసిన ట్రైలర్ క్యూరియాసిటీ కలిగిస్తోంది. కెప్టెన్ ఎవరనేది రాబోయే ఎపిసోడ్ లో క్లారిటీ రానుందా అనేది చూడాలి.
Captaincy task modhalaindhi…Who will make it? 👀
Find out on @StarMaa tonight, streaming 24/7 on @DisneyPlusHSTel.#BiggBossTelugu6 #BBLiveOnHotstar#StarMaa #DisneyPlusHotstar pic.twitter.com/N2ihSMTABY
— starmaa (@StarMaa) September 9, 2022