Chiranjeevi | చిరంజీవి, వశిష్ట సినిమాకు అదే టైటిల్ కన్ఫర్మ్ చేసుకోవచ్చా..?
Chiranjeevi | చిరంజీవి ప్రస్తుతం రెస్ట్‌లో ఉన్నాడు. ఆయన కాలికి సర్జరీ కావడంతో మరికొన్ని రోజులు షూటింగ్‌కు దూరంగా ఉండాలని ఫిక్స్ అయిపోయాడు మెగాస్టార్. పైగా వరుణ్ తేజ్ పెళ్లి కూడా ఉండటంతో ఇంటి పెద్దగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు
Chiranjeevi | చిరంజీవి ప్రస్తుతం రెస్ట్‌లో ఉన్నాడు. ఆయన కాలికి సర్జరీ కావడంతో మరికొన్ని రోజులు షూటింగ్‌కు దూరంగా ఉండాలని ఫిక్స్ అయిపోయాడు మెగాస్టార్. పైగా వరుణ్ తేజ్ పెళ్లి కూడా ఉండటంతో ఇంటి పెద్దగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. నవంబర్ 1న ఇటలీలోని ఒక లగ్జరీ రిసార్ట్ లో లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ పెళ్లి జరగబోతుంది. దీనికి మెగా హీరోలు అందరూ హాజరు కాబోతున్నారు. అక్టోబర్ చివరి వారం నుంచి వాళ్ల షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని వారం రోజులు బ్రేక్ తీసుకోబోతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాలను పక్కనపెట్టి కొడుకు పెళ్లి కోసం ప్రత్యేకంగా డేట్స్ బ్యాలెన్స్ చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే చిరంజీవి, వశిష్ట సినిమా డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా జోరుగా జరుగుతుంది. కథ కూడా ఫైనల్ కావడంతో డబుల్ జోష్ మీద ఉన్నాడు వశిష్ట. బింబిసార తర్వాత కావాల్సినంత బ్రేక్ తీసుకొని ఈ స్టోరీ రాసుకున్నాడు వశిష్ట. మధ్యలో ఆయన రెండు మూడు సినిమాలు ట్రై చేశాడు కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. చివరికి చిరంజీవితో ప్రాజెక్టు కన్ఫర్మ్ అయింది. UV క్రియేషన్స్ ఏ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించబోతుంది. సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో చిరు సినిమా వస్తుంది.
జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి తర్వాత ఇలాంటి సినిమాలకు దూరంగా ఉన్నాడు చిరంజీవి. సోషల్ సినిమాలు, అందులోనూ మెసేజ్ ఓరియంటెడ్ కథలవైపు అడుగు వేశాడు మెగాస్టార్. కానీ చాలా రోజుల తర్వాత వశిష్ట చెప్పిన కథ నచ్చి ఈ సినిమాకు ఓకే చెప్పాడు. కాగా ఈ సినిమాకు ముల్లోక వీరుడు అనే టైటిల్ ఆలోచిస్తున్నారు. దాంతో పాటు మరో రెండు మూడు టైటిల్స్ కూడా ఆప్షన్స్‌లో పెట్టుకున్నాడు వశిష్ట. అయితే అన్నింటికంటే ముల్లోక వీరుడు అనే టైటిల్ కథకు బాగా సూట్ అవుతుందని ఆయన భావిస్తున్నాడు. దీనికి చిరంజీవి కూడా ఓకే అన్నట్టు తెలుస్తుంది. త్వరలోనే అధికారిక సమాచారం రానుంది.
2024లో ఈ సినిమాతో పాటు మరో సినిమా కూడా సైన్ చేస్తున్నాడు చిరంజీవి. కళ్యాణ్ కృష్ణ కథ ఇంకా ఫైనల్ కాకపోవడంతో అనిల్ రావిపూడి సినిమాతో బిజీ అవ్వాలని చూస్తున్నాడు. ఈయనతో పాటు త్రివిక్రమ్ కూడా చిరంజీవి కోసం ఒక కథ సిద్ధం చేస్తున్నాడు. నిజానికి ఈ ప్రాజెక్టు చాలా రోజుల నుంచి చర్చల దశలోనే ఉంది. ఇద్దరిలో ఎవరో ఒకరితో ఖచ్చితంగా 2024లో సినిమా పట్టాలెక్కడం ఖాయం. 2025 సంక్రాంతికి వశిష్ట సినిమా.. సమ్మర్ సీజన్ లో మరో సినిమా విడుదల చేయాలని చూస్తున్నాడు మెగాస్టార్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

