ఓ వైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో తీరిక లేకుండా బిజీ షెడ్యూల్‌తో ఉన్నారు టాలీవుడ్ నటుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan). చాలా కాలం తర్వాత పవన్‌కల్యాణ్ కొత్తగా కనిపిస్తున్న స్టిల్ ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఎప్పుడూ సాదాసీదాగా కనిపించే పవన్ కల్యాణ్ ఈ సారి కొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇంతకీ న్యూ లుక్ స్పెషల్ ఏంటని గమనిస్తే పవన్ కల్యాణ్ చేతికి రత్నాలు (Astro Rings) కనిపిస్తున్నాయి. ఇపుడంతా ఈ రింగ్స్ గురించే చర్చ నడుస్తోంది.
చాలా ఏండ్లుగా చేగువేరా భావజాలంతో క్యాంపెయిన్‌లో పాల్గొంటూ వస్తున్న పవన్ కల్యాణ్..ఒక్కసారిగా ఇలా బాలకృష్ణ లాగా జ్యోతిష్యం (Astrology)వైపు అడుగులే వేయడం ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. 2019లో ముఖ్యమంత్రి కావాలని కలలు కన్న పవన్..అప్పట్లో మెడకు ప్రత్యేకమైన ఎరుపు రంగు దారాన్ని ధరించారు. అయితే ఆ ప్లాన్ మాత్రం వర్కవుట్ కాలేదు. దీంతో పవన్ ఈ సారి రూటు మార్చి ఉపనయనం తీసుకున్నట్టు తాజా స్టిల్‌తో అర్థమవుతుంది.
అంతేకాదు కొంతకాలం జంధ్యం ధరించి కూడా కనిపించారు. తాజాగా నిర్వహించిన ఓ పొలిటికల్ ఈవెంట్లో పవన్ కల్యాణ్ చేతికి జెమ్ స్టోన్స్ కనిపించడంతో పవన్ కళ్యాణ్ చాలా తేలికగా ప్రభావితం చేయగలడని, మూఢనమ్మకాలు, సెంటిమెంట్స్ ను సులభంగా నమ్మేస్తాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అవన్నీ పక్కన పెడితే.. మతతత్వంలో ఉండటం తప్పేమి లేదు.
కానీ వేర్వేరు సమయాల్లో ఇలా డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తూ…మిగతా వారిని ఫాలో అవడం పార్టీకి ఇబ్బంది కలిగించే విధంగా కనిపిస్తోందని అంతా అనుకుంటున్నారు. అయితే పవన్ కల్యాణ్ చేతి రింగ్స్ డెసిషన్ వెనుక ఓ డైరెక్టర్ ఉన్నాడని ఇన్ సైడ్ టాక్. మరి పవన్ కల్యాణ్ జెమ్ స్టోన్స్ ఆలోచన నెక్ట్స్ ఎన్నికల్లో ఆయన్ను రాజకీయంగా ఎంత బలంగా చేస్తుందో వేచి చూడాలంటున్నారు ఫాలోవర్లు, అభిమానులు.