Thimmarusu Collections| ‘తిమ్మరుసు’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఇవే..ఇంకెంత రావాలి..?
టాలీవుడ్ (Tollywood) లో మళ్లీ చాలా రోజుల తర్వాత జులై 30న సత్యదేవ్ (Satyadev) నటించిన తిమ్మరుసు (Thimmarusu) విడుదలైంది.

ఓ సినిమాకు ఫస్ట్ వీక్ కలెక్షన్స్ అని రాసి ఎన్ని రోజులైపోయిందో..? సగటు సినీ విమర్శకుడి ఫీలింగ్ ఇదే. ఎందుకంటే అప్పుడెప్పుడో వకీల్ సాబ్ సినిమా తర్వాత మళ్లీ కలెక్షన్స్ అనే మాటే పూర్తిగా ఆగిపోయింది ఇండస్ట్రీలో. మళ్లీ చాలా రోజుల తర్వాత జులై 30న తిమ్మరుసు (Thimmarusu)తో పాటు ఇష్క్ సినిమాలు విడుదలయ్యాయి. ఈ రెండింటిలో ఇష్క్ తొలిరోజే రేసు నుంచి తప్పుకుంది. ఇక మిగిలిన తిమ్మరుసు సినిమాకు బాక్సాఫీస్ దగ్గర కాసిన్ని డబ్బులు వచ్చాయి. సత్యదేవ్ (Satyadev) హీరోగా వచ్చిన ఈ చిత్రాన్ని శరణ్ కొప్పిశెట్టి తెరకెక్కించాడు. మహేష్ కోనేరు నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్ వీక్ కలెక్షన్స్ వచ్చాయి. చేసిన బిజినెస్‌కు..ఇప్పుడున్న పరిస్థితులకు..సినిమా తీసుకొచ్చిన కలెక్షన్స్‌కు ఎక్కడా పెద్దగా పొంతన లేదు. ఇంకా 30 శాతం కలెక్షన్స్ వేటలో వెనకబడే ఉంది తిమ్మరుసు. అసలు ఈ చిత్రం ఫస్ట్ వీక్ ఎన్ని కోట్లు వసూలు చేసిందో చూద్దాం..
ఫస్ట్ వీక్ ఎన్ని కోట్లు వచ్చాయంటే..
నైజాం: 0.65 కోట్లు
సీడెడ్: 0.21 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.27 కోట్లు
ఈస్ట్: 0.16 కోట్లు
వెస్ట్: 0.09 కోట్లు
గుంటూరు: 0.11 కోట్లు
కృష్ణా: 0.14 కోట్లు
నెల్లూరు: 0.07 కోట్లు
ఏపీ + తెలంగాణ: 1.70 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 0.13 కోట్లు
వరల్డ్ వైడ్: 1.83 కోట్లు
సత్యదేవ్ కు మార్కెట్ బాగానే ఉండటంతో ‘తిమ్మరుసు’ సినిమాను రూ.2.4 కోట్లకు అమ్మారు. ఈ సినిమా విజయం సాధించాలంటే దాదాపు రూ. 3 కోట్ల వరకు రావాలి. ఇంకా చెప్పాలంటే రూ. 2.7 కోట్ల వరకు వసూలు చేయాల్సిందే. అయితే ఈ చిత్రం వారం రోజుల్లో రూ.1.83కోట్ల షేర్ వసూలు చేసింది. ఇంకా 80 లక్షలకు పైగా బాకీ పడింది తిమ్మరుసు. ఇప్పటికే చాలా చోట్ల కలెక్షన్స్ తగ్గుముఖం పట్టాయి. పైగా రెండో వారం SR కళ్యాణమండపం సినిమా విడుదలైంది. దాంతో తిమ్మరుసు లక్ష్యానికి కాస్త దూరంలోనే ఆగిపోయేలా కనిపిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి..
Samantha Gym Video | సమంత రిస్కీ వర్కవుట్స్ వీడియో వైరల్
JokkeJokkeMeke Song | ‘జోకే జోకే మేకే’ పుష్ప సాంగ్ ఇంట్రడక్షన్ వీడియో కేక
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

