రాజ్‌కుంద్రా కేసు.. పోర్న్ క్లిప్‌లను డిలీట్ చేయమన్నారు!

ముంబై: రాజ్‌కుంద్రా పోర్న్ రాకెట్లో పట్టుబడిన నలుగురు ఉద్యోగులు కొన్ని రహస్య విషయాలు వెల్లడించారు. నీలిచిత్రాలకు సంబంధించిన కొన్ని క్లిప్‌లను డిలీట్ చేయాలని కుంద్రా ఆదేశించినట్లు ఆ ఉద్యోగులు విచారణలో భాగంగా పోలీసులకు తెలిపారు. హాట్‌షాట్స్‌కు చెందిన యాప్ నుంచి ఆ పోర్న్ క్లిప్‌లను అప్లోడ్ చేసినట్లు నలుగురు ఉద్యోగులు చెప్పారు. హాట్‌షాట్స్ యాప్ ద్వారానే రాజ్‌కుంద్రా ఇండియాలో నిర్మాణం చేసిన నీలిచిత్రాల వీడియోలను స్ట్రీమింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం హాట్‌షాట్స్ యాప్‌ను గూగుల్ స్టోర్, ఐఓఎస్ నుంచి తొలగించారు. అయితే దాని స్థానంలో బాలీఫేమ్ అనే యాప్‌తో వ్యాపారం చేస్తున్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు.
జూలై 19న అరెస్టు అయిన కుంద్రాను జూలై 27వ తేదీ వరకు పోలీసు కస్టడీలోకి పంపారు. కుంద్రాను అరెస్టు చేసిన మరుసటి రోజే అతని రికార్డుల నుంచి డేటాను డిలీట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పోర్న్ రాకెట్‌తో లింకు ఉన్న యశ్ థాకూర్ అనే మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఓ అధికారి భార్య పేరిట యాప్‌ను రిజిస్టర్ చేసి.. దాని ద్వారా పోర్న్ క్లిప్‌లను అప్లోడ్ చేసినట్లు పసికట్టారు. తన భర్త కుంద్రా పోర్న్ ఫిల్మ్ మేకింగ్‌లో పాల్గొనలేదని నటి శిల్పాశెట్టి పేర్కొన్నది. కుంద్రా తరపున వాదిస్తున్న లాయర్ అబద్ పోండా.. ఆ యాప్స్‌లో ఉంది పోర్న్ కాదు అని, అది కేవలం వెబ్ సిరీస్ కంటెంట్ అని తెలిపారు. నెట్‌ఫ్లిక్స్ లాంటి ఓటీటీ వేదికల్లో కూడా ఇలాంటి కంటెంట్ ప్రసారం అవుతోందన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

