వెబ్ సిరీస్ కంటెంట్ .. పోర్న్ కాదు: రాజ్‌కుంద్రా

ముంబై: పోర్న్ రాకెట్ నడుపుతున్నట్లు బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్‌కుంద్రాను ఇటీవల ముంబై క్రైం బ్రాంచీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో రాజ్‌కుంద్రా లాయర్ కోర్టులో తన వాదనలు వాదించారు. లాయర్ అబద్ పోండా కోర్టులో వాదిస్తూ.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని 67ఏ సెక్షన్ ను రాజ్‌కుంద్రాపై మోపడం సరైంది కాదన్నారు. ఈ చట్టం ప్రకారం నిజమైన శృంగార సంభోగమే పోర్న్ అని, మిగితా అంతా బూతు కాంటెంట్‌గా పరిగణిస్తారని లాయర్ తెలిపారు. ఐటీ చట్టాలను.. ఐపీసీ సెక్షన్లతో కలపరాదు అని, కానీ ముంబై పోలీసులు ఆ పనిచేశారని, ఐటీ చట్టంలోని 67ఏ యాక్ట్ కేవలం అశ్లీల చర్యల గురించి విశదీకరిస్తుందన్నారు. ఇద్దరి మధ్య జరిగే శారీరక కలయిక మాత్రమే పోర్న్గా భావించాలని, మిగితా వాటిని కేవలం బూతుగా పరిగణించాలన్నారు. సంభోగం నిజం కానప్పుడు.. దాన్ని నీలి చిత్రంగా భావించరాదు అన్నారు.
మరోవైపు పోర్న్ కేసులో అరెస్టు అయిన రాజ్‌కుంద్రా.. మందస్తు బెయిల్ కోసం అర్జీ పెట్టుకున్నారు. హాట్‌షాట్స్ యాప్ కోసం నీలి చిత్రాలను.. రాజ్‌కుంద్రా విదేశీలకు వాటిని ట్రాన్స్ఫర్ చేసి అప్లోడ్ చేసేవారని ఆరోపణలు ఉన్నాయి. పోర్న్ స్కామ్‌లో శుక్రవారం వరకు ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నారు. చట్టానికి లోబడి రాజ్‌కుంద్రాను అరెస్టు చేయలేదని లాయర్ పోండా తెలిపారు. ఇప్పటి వరకు ఈ కేసులో 11 మందిని అరెస్టు చేశారు. మంగళవారం ర్యాన్ థోర్ప్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. నటి గెహనా వసిస్ట్ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. తనను అనవసరంగా అరెస్టు చేసినట్లు చెప్పారు. ఆ వీడియో కేవలం శృంగారపూరితమైనవని, అవి నీలి చిత్రాల కిందకు రావు అని ఆమె అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

