Manchu Manoj | సినీ నటుడు మంచు మనోజ్ తన పుట్టినరోజు సందర్భంగా మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొంతకాలంగా మంచు కుటుంబంలో జరుగుతున్న అంతర్గత విభేదాలు, ఆస్తి గొడవలు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులు ఆయనను పాత వివాదాలను ప్రస్తావిస్తూ ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేశారు.
మీ ఫ్యామిలీ ఇష్యూస్ అన్నీ ఇప్పుడు క్లియర్ అయినట్టేనా? అని ఒక విలేకరి అడగ్గా.. మనోజ్ ఏమాత్రం తడుముకోకుండా, తనదైన శైలిలో నవ్వుతూ వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. “ఆ ప్రశ్న ఎవరిని అడగాలో మీ అందరికీ బాగా తెలుసు… వెళ్లి ఆయన్నే అడగండి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి.. మైక్ పట్టుకుని కాదు, తలకు హెల్మెట్ పెట్టుకుని వెళ్లండి’! అని మనోజ్ నవ్వుతూ చెప్పుకోచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Media Person: మీ ఫ్యామిలీ ఇష్యూ క్లియర్ అయినట్టేనా ? #ManchuManoj: అది ఎవరిని అడగాలో మీకు తెలుసుగా ? వెళ్ళి అడగండి. కానీ Mic పట్టుకొని వెళ్లొద్దు. హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి. pic.twitter.com/M4WBvEe1rH
— cinee worldd (@Cinee_Worldd) May 19, 2026