FDC Chairman | తెలంగాణ సినిమా రంగం అభివృద్ధికి ప్రత్యేక పాలసీని తీసుకువస్తాం : ఎఫ్డీసీ చైర్మన్
FDC Chairman | తెలంగాణ సినిమారంగ అభివృద్ధికి ఒక పాలసీని తీసుకురావాలనుకుంటున్నామని రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్(FDC Chairman) అనిల్ కుర్మాచలం అన్నారు.
హైదరాబాద్ : తెలంగాణ సినిమారంగ అభివృద్ధికి ఒక పాలసీని తీసుకురావాలనుకుంటున్నామని రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్(FDC Chairman) అనిల్ కుర్మాచలం తెలిపారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని కార్యాలయంలో ఎఫ్డీసీ ఆధ్వర్యంలో బలగం సినిమా బృందానికి(Balagam Movie Unit) అభినందన సభ నిర్వహించారు.ఈ సందర్భంగా సినీ బృందాన్ని సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు.

చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ సినిమా(Telangana cinema) ఎంతో ముందుకు వెళ్లాలని అందుకు ప్రభుత్వం తరపున ప్రోత్సాహం అందించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా చిల్డ్రన్ సినిమాలకు మంచి ఆదరణ ఉందని, కానీ తెలుగులో చిల్డ్రన్ సినిమాలు రావడం తగ్గిందని పేర్కొన్నారు. మంచి కథలలో సరికొత్త చిల్డ్రన్ సినిమాలను తీయడానికి దర్శక నిర్మాతలు ముందుకురావాలని అందుకు ఎఫ్డీసీ తరపున సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

తెలంగాణ పల్లె సంస్కృతి(Village Culture)ని అద్భుతంగా ఆవిష్కరించిన బలగం సినిమా చరిత్ర సృష్టించిందని ప్రశంసించారు. తెలుగు సినీరంగానికి కొత్త వారిని పరిచయం చేస్తూ ప్రతిభావంతుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌ను ప్రారంభించిన నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డిలను అభినందించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు మాట్లాడారు. హీరో ప్రియదర్శి, హీరోయిన్ కావ్య, పాటల రచయిత శ్యామ్ కాసర్ల, గాయకురాలు మంగ్లీ, సినిమాటోగ్రాఫర్ ఆచార్య వేణు, ఎడిటర్ మధు, నటులు రచ్చ రవి, రూప లక్ష్మీ, ఎఫ్డీసీ సిబ్బంది డి. విజయ్, సంజీవ్ కుమార్, దేవ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

