‘జనరేషన్ మారుతున్న ప్రతిసారీ గతంలో వచ్చిన కొన్ని చక్కటి సినిమాలను చూడాలని ఈతరం ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అప్పట్లో ఎలా తీశారు? ఎందుకు తీశారు? ఇంకా టెక్నికల్‌గా అప్పుడు వచ్చిన అప్డేట్స్ వంటివి చూడాలని వారు ఆశిస్తారు’ అందుకే అడవి సినిమా టెక్నికల్ హైలైట్స్ ఇప్పటి ఆడియెన్స్ కు చూపించాలని మళ్లీ విడుదల చేస్తున్నాం’ అన్నారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.
ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నిర్మాత, పంపిణీదారుడు నట్టికుమార్ రిలీజ్ చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ‘ఇటీవల ధనుష్ ‘3’ సినిమాను విడుదల చేశాం. మంచి స్పందన వచ్చింది. ఆ ధైర్యంతోనే ఈ నెల 15న ప్రభాస్ రెబల్, వర్షం సినిమాలతో పాటు ఈ నెల 14న అడవిని మళ్లీ విడుదల చేస్తున్నాను. గత కొన్నాళ్లుగా నాకు రామ్‌గోపాల్ వర్మ మధ్య ఉన్న అభిప్రాయభేదాలను సామరస్యంగా పరిష్కరించుకున్నాం. మా కాంబినేషన్లో త్వరలో మరిన్ని సినిమాలు రాబోతున్నాయి’ అన్నారు.