Waltair Veerayya | వాల్తేరు వీరయ్య ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. రిలీజ్ ఎన్నిటికంటే?
మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి పోరుకు సిద్ధమవుతున్నాడు. చిరు రీ ఎంట్రీ సినిమాకు ఘనంగా స్వాగతం పలికిన ప్రేక్షకులు..ఆ తర్వాత రిలీజైన మూడు సినిమాలను మొహమాటం లేకుండా తిరస్కరించారు.
Waltair Veerayya Trailer | మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి పోరుకు సిద్ధమవుతున్నాడు. చిరు రీ ఎంట్రీ సినిమాకు ఘనంగా స్వాగతం పలికిన ప్రేక్షకులు..ఆ తర్వాత రిలీజైన మూడు సినిమాలను మొహమాటం లేకుండా తిరస్కరించారు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ ఆశలన్నీ ‘వాల్తేరు వీరయ్య’ పైనే ఉన్నాయి. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంతంత మాత్రంగానే అంచనాలున్నాయి. ఎందుకంటే దర్శకుడిగా బాబీకి చెప్పుకోదగ్గ హిట్లు లేవు. ఇప్పటి వరకు బాబీ నాలుగు సినిమాలకు దర్శకత్వం వహిస్తే.. అందులో రెండు ప్లాప్‌లు, రెండు ఎబో యావరేజ్‌లు ఉన్నాయి. దాంతో అటు అభిమానుల్లో ఇటు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంతంత మాత్రంగానే అంచనాలున్నాయి.
అయితే చిత్రబృందం వరుసగా ప్రమోషన్లు జరుపుతూ కొంచెం కొంచెంగా బజ్ క్రియేట్ చేస్తున్నారు. నిజానికి సినిమాపై మంచి బజ్ రావాలంటే ట్రైలర్ ఒక్కటి చాలు. శుక్రవారం రిలీజైన వీర సింహా రెడ్డి సరిగ్గా ఇదే యూజ్ చేసుకుంది. ఒక్క ట్రైలర్‌తోనే సినిమాపై ఇప్పటివరకు ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. ఇక ఇప్పుడు వాల్తేరు వీరయ్య వంతుకు వచ్చింది. వాల్తేరు వీరయ్య ట్రైలర్ శనివారం రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ రెండు రోజుల ముందే ప్రకటించారు. కాగా తాజాగా ట్రైలర్ టైమ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. వాల్తేరు వీరయ్య ట్రైలర్‌ను సాయంత్రం 6గంటల 3 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మరీ ఈ వీరయ్య.. ఆ వీర సింహా రెడ్డి రేంజ్లో ఆకట్టుకుంటాడో లేదో చూడాలి.
MASS MOOLAVIRAT veta modhalu 🔥💥#WaltairVeerayyaTrailer strikes today at 6.03 PM ❤️🔥#WaltairVeerayya#WaltairVeerayyaOnJan13th
Megastar @KChiruTweets @RaviTeja_offl @dirbobby @shrutihaasan @CatherineTresa1 @ThisIsDSP @konavenkat99 @SonyMusicSouth pic.twitter.com/Cwo042K1fY
— Mythri Movie Makers (@MythriOfficial) January 7, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

