Vishwak Sen | మానవ స్పర్శను అనుభవించలేని అరుదైన వ్యాధితో బాధపడుతున్న అఘోరాగా విశ్వక్సేన్ నటించిన చిత్రం ‘గామి’. విద్యాధర్ కాగిత దర్శకుడు. కార్తీక్ శబరీశ్ నిర్మాత. మార్చి 8న విడుదల కానున్న ఈ చిత్రం ప్రచారంలో భాగంగా శనివారం టీజర్‌ని విడుదల చేశారు. ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ ఈ టీజర్ సాగింది.
ఇందులో విశ్వక్సేన్ పాత్ర అనుభవిస్తున్న సమస్యకు పరిష్కారాన్ని చెప్పే వాయిస్‌ఓవర్‌తో టీజర్ ప్రారంభమైంది. ఎం.జి.అభినయ, చాందినిచౌదరి.. ఇంకా ఇతర పాత్రలతోపాటు చివరిగా శంకర్ అనే అఘోరాగా విశ్వక్ పరిచయం అయ్యాడు. ‘ఇవన్నీ దాటుకొని నా వల్ల అవుతుందంటారా?’ అని విశ్వక్ చెప్పడం, చివరకు విశ్వక్, చాందిని హిమాలయ పర్వతాలపై ట్రెక్కింగ్ ఇవన్నీ టీజర్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ నెల 29న థియేట్రికల్ ట్రైలర్ విడుదల కానుంది. హారిక పెడాడ, మహ్మద్ సమద్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈచిత్రానికి కెమెరా: విశ్వనాథరెడ్డి, రాంపీ నందిగాం, సంగీతం: నరేశ్ కుమారన్.