అజయ్ కతుర్వార్ హీరోగా నటిస్తున్న సినిమా ‘విశ్వక్’. గోల్డెన్ డక్ ప్రొడక్షన్స్ పతాకంపై తాటికొండ ఆనందం బాలకృష్ణ నిర్మిస్తున్నారు. వేణు ముల్కాకా దర్శకుడు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న విశ్వక్ సినిమా ఈ నెల 18న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా హైదరాబాద్ లో ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు వేణు ముల్కాకా మాట్లాడుతూ…‘వివిధ వృత్తుల రీత్యా దేశం వదిలి మేధావులు వెళ్లిపోతున్నారు. మన దగ్గర ఉన్న మేధస్సు విదేశాలకు చెందుతోంది. అది స్వదేశ అభివృద్ధికి ఉపయోగపడాలి అనే విషయాన్ని మా సినిమాలో చెబుతున్నాం’ అన్నారు. కథ, కథనాలు బాగుంటే చిన్న చిత్రాలకైనా మంచి ఆదరణ ఉంటుందని, సినిమా చూసిన వాళ్లు స్ఫూర్తి పొందుతారని అన్నారు కథానాయకుడు అజయ్ కతుర్వార్.